English | Telugu

జ్యోతక్క అందాలు...గంగులు అదృష్టవంతుడు

ప్రస్తుతం ఎప్పుడేది ట్రెండింగ్ అవుతుందో ఎవరికి ఎరుక.. ఎప్పుడేది వైరల్ అవుతుందో ఎవరికి ఎరుక అన్నట్టుగా మారింది. కొంతమంది సెలెబ్రిటీలు కారు కొన్నా ఇల్లు కొన్నా వ్లాగ్స్ చేస్తూ ఫేమస్ అవుతారు. కానీ మరికొందరు ఓ చిన్న ఫోటోషూట్ తో ట్రెండింగ్ లోకి వచ్చేస్తారు.

అందులో భాగంగానే సావిత్రి అలియాస్ జ్యోతక్క తన ఇన్ స్టాగ్రామ్ లో పూలతో ఉన్న చీరలో అందంగా ముస్తాబై ఓ రీల్ చేసింది. దానికి ఇప్పుడు అత్యదిక వ్యూస్ వస్తున్నాయి. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్ అంటారు కదా.. అలా ఉన్నాయి. జ్యోతక్క భర్త గంగులు కూడా తనతో కలిసి రెగ్యులర్ గా వ్లాగ్స్ రీల్స్ చేస్తాడు. అవి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా తను చేసిన ఈ రీల్ నెట్టింట వైరల్ అవుతోంది. గంగులు అదృష్టవంతుడు అని ఒకరు కామెంట్ చేయగా.. పేరుకి తగ్గట్టుగా ఎంత అందంగా ఉన్నారండి అని మరొకరు కామెంట్ చేశారు. పూలతోట నడుచుకుంటూ వస్తుంది అని మరొకరు కామెంట్ చేశారు. ఇలా నెటిజన్ల కామెంట్ తో సావిత్రి ఒక్కసారిగా ఫేమస్ అయింది. శివజ్యోతికి ఇన్ స్టాగ్రామ్ లో 1.1మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తన యూట్యూబ్ ఛానెల్ కి పది లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇక ఇటు ఇన్ స్టాగ్రామ్ రీల్స్, ఫోటోషూట్స్, అటు యూట్యూబ్ లో వ్లాగ్స్ రెగ్యులర్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది ఈ భామ.

తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరు తో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో వల్ల మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి.. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హోస్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ గా శివజ్యోతి ని చెప్తారు... బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి కి కెరీర్ కి బ్రేక్ పడింది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.