English | Telugu

Brahmamudi :  కావ్య.. అబార్షన్ చేయించుకుంటుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmmudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -835 లో..... కావ్యని తీసుకొని రాజ్ హాస్పిటల్ కి వెళ్తాడు. కావ్యని బయటే కూర్చో పెట్టి డాక్టర్ దగ్గరకి వెళ్తాడు రాజ్. నా భార్యకి అబార్షన్ చెయ్యండి కానీ తనకి చెప్పొద్దని రాజ్ అనగానే.. లేదు అలా చెప్పకుండా చేయడం కరెక్ట్ కాదని డాక్టర్ అంటుంది.

ఆ తర్వాత డాక్టర్ ని రాజ్ రిక్వెస్ట్ చేస్తుంటే కావ్య వస్తుంది. ఏం చేస్తున్నారు.. బేబీ చెకప్ అని తీసుకొని వచ్చి నాకు అబార్షన్ చేయించడానికి తీసుకొని వచ్చావా అని రాజ్ పై కావ్య కోప్పడుతుంది. కావ్య కోపంగా అక్కడ నుండి ఆటోలో ఇంటికి వెళ్తుంది. రాజ్ వెనకాలే వెళ్తాడు. కావ్య ఇంటికి వెళ్లి జరిగిందంతా అందరికి చెప్తుంది. అది విని అందరు షాక్ అవుతారు. ఎందుకు అబార్షన్ అంటున్నావ్ రా అని రాజ్ ని అపర్ణ అడుగుతుంది. నా బిడ్డ నా ఇష్టం నేను చెప్తున్నాను కదా.. అబార్షన్ చేయించుకోవాల్సిందేనని కావ్యతో రాజ్ అంటాడు.

ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ బిడ్డపై మీకేంత హక్కు ఉందో నాక్కూడా అంతే ఉందని కావ్య అంటుంది. నాకు అదంతా అవసరం లేదు. రేపు నువ్వు వచ్చి నేను చెప్పినట్టు వింటున్నావ్ అంతే అని రాజ్ వెళ్ళిపోతాడు. మరొకవైపు అసలు ఏం జరుగుతుందోనని రుద్రాణి ఆలోచిస్తుంటే రాహుల్ వస్తాడు. ఇదే మనకి మంచి ఛాన్స్ రాజ్ పై ఇంట్లో అందరికి కోపం కలిగేలా చెయ్యాలని అంటాడు. తరువాయి భాగంలో రాజ్ అసలు విషయం అపర్ణ, సుభాష్ కి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.