English | Telugu

Brahmamudi:  స్వరాజ్ ని తీసుకొచ్చాడు.. కావ్యని చూసి ఇంప్రెస్ అయిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -801 లో రాజ్ ని ఇంటికి ఎలా రప్పించాలని అపర్ణ , ఇందిరాదేవి ఆలోచిస్తుంటే.. అప్పుడే రేవతి ఫోన్ చేసి స్వరాజ్ తో మాట్లాడిస్తుంది. ఆ తర్వాత అపర్ణకి ఒక ఐడియా వస్తుంది. స్వరాజ్ ని తీసుకొని ఇక్కడికి రమ్మని రాజ్ కి చెప్దామని ఇద్దరు ప్లాన్ చేస్తారు.ఆ తర్వాత యామినికి రుద్రాణి ఫోన్ చేసి.. కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తుంది.

ఇద్దరు కలిసి కావ్య తనంతట తానే ప్రెగ్నెంట్ అని చెప్పేలా ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత రాజ్ కి ఇందిరాదేవి ఫోన్ చేసి రేపు స్వరాజ్ ని తీసుకొని ఇంటికి రమ్మని చెప్తుంది. కాసేపటికి రాజ్ దగ్గరికి యామిని వస్తుంది. బావ నిన్ను ఆ కళావతి ఎందుకు దూరం పెడుతుందో తెలుసా. నిన్ను పెళ్లి చేసుకుంటే అంత మంచి కుటుంబాన్ని వదిలి రావాలని ఆలోచిస్తుందని యామిని అనగానే అది కూడా కరెక్టే అని రాజ్ అనుకుంటాడు.

ఆ తర్వాత కావ్య కిచెన్ లో వర్క్ చేస్తుంటే.. వద్దని ఇందిరాదేవి, అపర్ణ లోపలికి పంపిస్తారు. కిచెన్ లో అప్పు ఉంటుంది. అది రుద్రాణి చూసి ధాన్యలక్ష్మికి చెప్తుంది. కడుపుతో ఉంది నీకోడలు.. తనకి రెస్టా.. కావ్యకా.. నీ కోడలికి అన్యాయం జరుగుతుందని ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది కానీ ధాన్యలక్ష్మి పట్టించుకోదు. ప్లాన్ ఫెయిల్ అయిందని రుద్రాణి అనుకుంటుంది. కాసేపటికి స్వరాజ్ ని తీసుకొని రాజ్ ఇంటికి వస్తాడు. ఏం తెలియనట్లు అపర్ణ సర్ ప్రైజ్ గా ఫీల్ అవుతుంది. అప్పుడే కావ్య రెడి అయి పైనుండి కిందకి వస్తుంటే రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.