English | Telugu

Brahmamudi :  గతాన్ని మొత్తం చెప్పేసిన అప్పు, కళ్యాణ్.‌. పెళ్ళి సీన్ ని స్పష్టంగా గుర్తుచేసుకున్న రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-716లో.. కావ్య, రాజ్, అప్పు, కళ్యాణ్ లతో పాటు కొంతమంది అక్కడికి వస్తారు. వారిలో ఒక అమ్మాయి సత్య.. తను రాజ్ తో క్లోజ్ గా ఉంటుంది. రాజ్ కోసం సత్య ప్లేట్ తీసుకురావడం చూసిన కావ్య తన ప్లేట్ పగులగొట్టి అక్కడి నుండి వచ్చేస్తుంది. అది చూసిన సత్య.. తను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుంది.. అందుకే అలా కోపంగా ఉందని రాజ్ తో అంటుంది. దాంతో రాజ్.. కావ్య దగ్గరకి వెళ్లి ఏమైందని అడుగుతాడు. ఏం లేదు ప్లేట్ జారిపోయిందని కావ్య అంటుంది‌. ఇక అక్కడ కావ్య విసుక్కోవడం రాజ్ చూసి తనలో తాను నవ్వుకుంటాడు.

ఇక కావ్యతో కోపంగా వెళ్తుంది. వెంటనే రాజ్ తన దగ్గరికి వెళ్తాడు. నేను సత్య తెచ్చిన ప్లేట్ తీసుకున్నందుకు కోపం వచ్చిందా అని రాజ్ అంటాడు. సత్య కాకపోతే రుక్మిణీ ఇచ్చిన ప్లేట్ తీసుకోండి.. నాకేంటని కావ్య అంటుంది. ఇక యామినీ చాటుగా వింటూ ఉంటుంది. ఏం తెలియనట్లు మాట్లాడుతున్నారేంటీ.. నా మనసులో ఏముందో మీకు తెలియదా అంటూ కావ్య మాట్లాడే సరికి.. ఏముందో చెప్పండి అంటూ రాజ్ ఆశగా అడుగుతాడు. ఇక రాజే స్వయంగా.. మీరంటే నాకు ఇష్టమని చెప్పే పరిస్థితి రావడం అంతా అప్పూ, కవి దూరం నుంచి చూస్తుంటారు. మీరంటే నాకు మీరంటే నాకు అని రాజ్ నసుగుతుంటే.. బావా అని యామినీ కావాలనే ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడున్నావా? నీకోసం రిసార్ట్ అంతా వెతుకుతున్నా.. రా బావా తిందామని యామిని అంటుంది. నేను తినేశా నువ్వు వెళ్లు తిను అని రాజ్ అంటాడు. అయ్యో బావా నీ కంపెనీ లేకుండా నేను తినలేను రా బావా అంటూ బలవంతంగా రాజ్ ని లాక్కునిపోతుంది యామిని. ఇక మరోవైపు కావ్య అలానే చూస్తుంటే అప్పూ, కవి దగ్గరకు వచ్చి.. ఈ యామినీ కావాలనే తీసుకునిపోయింది. తనను తక్కువ అంచనా వేస్తున్నామని అంటారు. యామినీ నాటకాలన్నీ ఆయనకు గతం గుర్తొచ్చే వరకూ కదా.. ఎలా అయిన రాత్రికి మనం అనుకున్నది జరగాలని కావ్య అంటుంది.

ఇక పార్టీ మొదలవుతుంది. అప్పు, కావ్య ఇద్దరు తమ లవ్ స్టోరీ ఇదీ అంటు రాజ్, కావ్యల స్టోరీ చెప్తుంటారు. అది విని రాజ్ కనెక్ట్ అవుతాడు. ఇక పెళ్ళిలో కావ్య తాళి కట్టించుకున్న సీన్ దగ్గరి నుండి ఒక్కొక్కటి రాజ్ కి గుర్తొస్తుంటుంది‌. మరోవైపు రుద్రాణి, రాహుల్ వెయిటర్ వేషాల్లో ఉంటారు. ఇది రాజ్ స్టోరీ కదా అని రుద్రాణితో రాహుల్ అంటాడు. అదే సమయంలో యామినికి టెన్షన్ మొదలవుతుంది. పోదాం బావా అంటు రాజ్ తో అనగా‌.. వద్దు ఈ స్టోరీ బాగుందని రాజ్ అంటాడు‌. ఇక తరువాయి భాగంలో పార్టీలో కరెంట్ పోతుంది. రాజ్ లైట్ ఆన్ చేసి స్టేజ్ మీదకి వెళ్లి వింటూ ఉంటాడు. మొత్తం వింటూ గతం గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు రాజ్. ఆ ప్రయత్నంలోనే రాజ్‌కి కళ్లు తిరుగుతుంటాయి. మరి రాజ్ పడిపోతాడా.. యామిని అందరిని కాదని రాజ్‌ని అక్కడి నుంచి తీసుకునిపోతుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.