English | Telugu

Brahmamudi : అనామిక ప్లాన్ కనిపెట్టేసిన ప్రియుడు.. కోర్టు నోటీసులు పంపించిన ధాన్యలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -629 లో.. అనామిక సామంత్ లు చెస్ ఆడతారు. ఆ నందు గాడిని లేకుండా చేసి రాజ్ కావ్యలని మరింత ప్రాబ్లమ్ లోకి నెట్టేసాం.. వాళ్ళ కుటుంబం మొత్తం కుళ్ళి కుళ్ళి ఏడవాలని అనామిక అంటుంది. ఆ తర్వాత ఆ ఆఫీస్ ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అనామిక అంటుంది. అప్పుడు నీదే స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ అవుతుందని అనామిక అంటుంటే సామంత్ మురిసిపోతాడు. ఈ అనామికని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరంటూ తన గురించి తనే గొప్పగా చెప్తుంది.

ప్రకాష్ దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి ఈ నోటీసులపై సంతకం చెయ్యండని అంటుంది. ఏంటి ఇవి అని ప్రకాష్ అడుగుతాడు. మన వాటా మనకి ఇవ్వమని కోర్ట్ ద్వారా నోటిసులు అని ధాన్యలక్ష్మి అనగానే వద్దని ప్రకాష్ అంటాడు. దాంతో ధాన్యలక్ష్మి కోపంగా నా మెడలో తాళిని తెంపుతారా లేక సంతకం చేస్తారా అని బెదిరించడంతో ప్రకాష్ సంతకం పెడతాడు. భర్త పక్కన ఉంటే ఏదైనా చేయోచ్చని చూపిస్తానని ధాన్యలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు కావ్య వాషింగ్ మిషన్ నుండి బట్టలు ఆరేయ్యడానికి బయటకు తీస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ రాహుల్ .. ఇంకా నయం ధాన్యలక్ష్మి ని బట్టలు ఉతకమనలేదని రుద్రాణితో అంటాడు. ఈ కావ్యకి పర్మినెంట్ సొల్యూషన్ ప్లాన్ చేసాను.. కావ్యని లేపేస్తానని రుద్రాణితో రాహుల్ అంటాడు. వద్దురా అది మన మెడకి చుట్టుకుంటుందని రుద్రాణి టెన్షన్ పడుతుంది. అయిన రాహుల్ వినకుండా బయట కావ్య బట్టలు ఆరేసే తాడుకి రాహుల్ కరెంటు షాక్ వచ్చేలా సెట్ చేస్తాడు. కావ్య బట్టలు తీసుకొని బయటకు వస్తుంటే.. నువ్వు ఎందుకు పని చెయ్యడం అంటూ కావ్యతో స్వప్న అంటుంది. పర్లేదంటూ కావ్య ఆరేయ్యబోతుంటే అప్పుడే రాజ్ పిలుస్తాడు. దాంతో కావ్య లోపలికి వెళ్ళిపోతుంది.

ఇక అక్కడ స్వప్న ఉంటుంది. అప్పుడే వీడేం ప్లాన్ చేసాడో చెప్పలేదంటూ రుద్రాణి బయటకు వస్తుంది. దాంతో స్వప్న చూసి అత్త ఈ బట్టలు ఆరేయ్.. నీకు డబ్బు ఇస్తాను.. ఎలాగు మీ దగ్గర డబ్బు లేవ్ కదా అంటుంది. ఎలాగా మా దగ్గర డబ్బు లేవ్ సరే.. డబ్బు ఇవ్వు అంటూ రుద్రాణి బట్టలు ఆరెస్తుంది. దాంతో తనకి షాక్ వస్తుంది. స్వప్న కర్రతో రుద్రాణిని కొడుతుంది. అది చూసిన రాహుల్ వెళ్లి స్విచాఫ్ చేస్తాడు. ఈ రోజు మీ అమ్మని నేనే కాపాడనని స్వప్న అంటుంది. తరువాయి భాగంలో ఇంటికి కోర్ట్ నుండి నోటీసులు వస్తాయి. ఎవరు పంపించారు అని సుభాష్ అంటాడు. మేమే పంపించామని ధాన్యలక్ష్మి అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.