English | Telugu

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో సావిత్రి.. అడ్రెస్ కనిపెట్టగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -609 లో......రాజ్, కావ్య లు వెళ్తుంటే ఒకతను లిఫ్ట్ అడుగుతాడు. అతను రాజ్, కావ్య లని పరిచయం చేసుకుంటాడు. నా పేరు సావిత్రి అంటూ చెప్పగానే అదేంటి అమ్మాయి పేరు పెట్టుకున్నావని రాజ్, కావ్య అడుగగా.. తన పేరు వెనకున్న స్టోరీని సావిత్రి చెప్పుకొస్తాడు. అదేంటి అంత దరిద్రమైన జాతకమా అని రాజ్ అంటాడు. ఇప్పుడు నేను పెళ్లి చూపులకి వెళ్తున్నానని సావిత్రి చెప్తాడు.

ఆ తర్వాత సావిత్రి వెనకాల కావ్య పక్కన వెళ్లి కూర్చొని ఉంటాడు. మొదట రాజ్ డ్రైవర్ కావ్య మేడమ్ అని చెప్తాడు. దాంతో డ్రైవర్ అంటూ రాజ్ తో మాట్లాడుతాడు సావిత్రి. రాజ్ కి కోపం వస్తుంది. మరొకవైపు కళ్యాణ్ హాస్పిటల్ లో ఒక పోలీస్ మహిళను చూసి అప్పుని గుర్తు చేసుకుంటాడు. అప్పుతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత డ్రైవర్ కార్ ఆపు కొబ్బరి బొండం దగ్గర అని సావిత్రి అనగానే.. రాజ్ కార్ ఆపుతాడు. కావ్య కావాలనే సావిత్రి చెయ్ పట్టుకొని దిగుతుంది. దాంతో రాజ్ కుళ్ళు కుంటాడు. ఆ తర్వాత సావిత్రికి లాయర్ ఫోన్ చేసి కోర్ట్ లో కేసు గెలిచామని అంటాడు. దాంతో మేడం చెయ్ పట్టుకోగానే అదృష్టమని కావ్యని సావిత్రి పొగుడతాడు. దాంతో రాజ్ కి కోపం వచ్చి కొబ్బరి బొండం కాలుపై పడేస్తాడు.

మరొకవైపు నందగోపాల్ తన ఫామ్ హౌస్ కి వస్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ ని కాల్ చేసి రమ్మని చెప్తాడు. నువ్వే వచ్చి తీసుకొని వెళ్ళమని తను అనగానే.. సరే అని సెక్యూరిటీకి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రాజ్ కావ్య, సావిత్రి వాళ్లు వెళ్తుంటారు. అప్పుడే రాజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి నందగోపాల్ అడ్రస్ షేర్ చేస్తున్నానని అంటాడు. సరే వెంటనే వస్తున్నామని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.