English | Telugu

Brahmamudi : అనామిక కంగారు.. ప్రాణాపాయ స్థితిలో అసలు మాయ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -427 లో... ఇందిరాదేవి, సీతారామయ్యల దగ్గరకి స్వప్న వస్తుంది. కావ్యకి అన్యాయం జరుగుతున్న మీరెందుకని అపర్ణ అత్తయ్యని అటగట్లేదని, ఎందకని మౌనంగా ఉన్నారని అడుగగా.. మా పెద్దరికం ఉన్నంతవరకే మాట్లాడగలం కానీ తను మా మాట వినే స్టేజ్ దాటిపోయిందని వాళ్ళు అంటారు. ‌ఇక స్వప్న అక్కడి నుండి వెళ్లిపోతుంది.

మరోవైపు అనామికకి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి‌‌.. గంటలో పదిలక్షలు కావాలని అడుగుతుంది. అంత డబ్బు నేనెలా తీసుకొస్తానని అనామిక అనగానే.. నువ్వు డబ్బు తీసుకురాకుంటే అప్పుల వాళ్ళు మమ్మల్ని చంపేస్తారని అనామిక వాళ్ళ అనగానే.. సరే తీసుకొస్తానని అనాకిక అంటుంది ‌ అదంతా స్వప్న డోర్ దగ్గర దాక్కొని వింటుంది. ఇక కాసేపటికి కళ్యాణ్ రాసిన చెక్ ని తీసుకోవడం స్వప్న చూస్తుంది. ఇక కంగారుగా అనామిక చెక్ దాచిపెట్టి వెళ్తుంటే కళ్యాణ్ చూసి.. ఏంటి అంత కంగారు అని అడుగుతాడు. ఏమీ లేదని చెప్పి అనామిక వెళ్తుంది. మరోవైపు అసలు మాయ కోసం ఇదివరకు వెళ్లిన అడ్రస్‌కు అప్పు, కావ్య వెళ్తారు. వాళ్లని ఫాలో అవుతూ రాజ్ రాగా.. తనని డైవర్ట్ చేయడానికి అన్ని గల్లీలు తిరుగుతుంటారు ఇద్దరు‌. ఇక మరోవైపు కావ్యని ఫాలో అవుకుంటూ రుద్రాణి వెళ్తుంది. ఇక మాయ వాళ్ళింటికి అప్పు వెళ్లి డోర్ కొడుతుంది. అప్పు డోర్ కొట్టగానే ఇదివరకు తనతో మాట్లాడిన మాయ ఫ్రెండ్ సాహితి డోర్ తీస్తుంది. మాయ ఎక్కడ, వచ్చిందా అని అప్పు అడుగుతుంది. మాయను పిలుస్తావా అని అప్పు అనాగనే.. సాహితి సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి అసలు మాయ లగేజ్ పట్టుకుని వస్తుంది. అదంతా రుద్రాణి చాటుగా ఉండి చూస్తుంటుంది.

అప్పు, కావ్యను చూసి మాయ షాక్ అవుతుంది. తను కంగారుపడిన విషయం కావ్య, అప్పుకు అర్థమవుతుంది. తము ఎవరో మాయకు తెలుసని అర్థం చేసుకుంటారు. మర్యాదగా నేను అడిగినవాటికి జవాబు చెప్పు. ఇప్పటివరకు ఏమేం చేశావో ఆ నిజాలు చెప్పమని కావ్య ప్రశ్నిస్తుంది. కావ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లగేజ్ అక్కడే పడేసి మాయ పారిపోతుంది. మాయ వెంటే అప్పు, కావ్య పరుగెడుతుంటారు. అదంతా రుద్రాణి చూస్తూ ఉంటుంది. మాయ రోడ్డుపై పరుగెడుతుంటుంది. మాయ వెనుకే అప్పు, కావ్య పరుగెడుతుంటూ పిలుస్తున్నా గానీ మాయ ఆగదు. పరుగెడుతున్న మాయను కారులో వచ్చి యాక్సిడెంట్ చేస్తుంది రుద్రాణి. యాక్సిడెంట్ చేసి వెళ్లిపోతుంది రుద్రాణి. మాయ ఓ మూలకు ఎగిరిపడుతుంది. మాయ చనిపోయిందా లేదా అని కారు ఆపి వెనక్కి తిరిగి చూస్తుంది రుద్రాణి. మాయను లేవమని, ఏమైందని చెంపైపై కొడుతూ మాయను స్పృహలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు కావ్య, అప్పు. అది చూసి రుద్రాణి తను అనుకున్న పని అయిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.