English | Telugu

Brahmamudi : శోభనం కాదనుకొని స్టేషన్ కి వెళ్ళిన అప్పు.. ధాన్యలక్ష్మి చూస్తుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -732 లో....అప్పు స్టేషన్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. ఈ ఫస్ట్ నైట్ ప్లాన్ అంతా నీదే కదా.. నిన్న నైట్ శోభనం అన్నావ్.. బయటకు వచ్చేసరికి అత్తయ్య ఉంది.. మార్నింగ్ పంతులిని పిలిచి ముహూర్తం పెట్టించిందని అప్పు అనగానే.. లేదు నాకేం తెలియదని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు మీకు శోభనం జరుగుతుంది. వెళ్లి స్వప్న గదిలో ఉండు.‌ మీ అక్కలు రెడీ చేస్తారని ధాన్యలక్ష్మి అంటుంది.

మరొకవైపు ఈ రోజు నీ చెల్లికి శోభనం కదా తనకి నీ నగలతో రెడీ చెయ్ అని స్వప్నతో రాహుల్ అంటాడు. అదేంటి ఎన్నడు లేనిది ఇలా అంటున్నావ్.. అయిన నా నగలు లాకర్ లో ఉన్నాయని స్వప్న అంటుంది కానీ నువ్వు చెప్పేది ఈ సారి వినాలనిపిస్తుంది.. వెళ్లి నగలు తీసుకొని వద్దామని స్వప్న అంటుంది. ఆ తర్వాత రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. మరోవైపు కావ్య, రాజ్ కలసి శోభనం ఏర్పాట్లకి కావల్సిన లిస్ట్ ప్రిపేర్ చేస్తారు.

స్టేషన్ కి ఒక పిల్లాడు వెళ్తాడు. రౌడీ చెప్పినట్లు కానిస్టేబుల్స్ తాగే టీలో ఏదో టాబ్లెట్ కలుపుతాడు. ఆ టీ తాగి అందరు స్పృహ తప్పి పడిపోతారు. మరోవైపు అప్పుని స్వప్న తన నగలతో అందంగా రెడీ చేస్తుంది. రాహుల్ వచ్చి అన్ని నగలు పెట్టి రెడీ చెయ్ అంటాడు. ఆ తర్వాత స్టేషన్ నుండి కానిస్టేబుల్ అప్పుకి ఫోన్ చేసి సెల్ లో ఉన్న అతను తప్పించుకున్నాడని చెప్తాడు. దాంతో కళ్యాణ్ దగ్గరికి అప్పు వచ్చి.. నేను ఇప్పుడు స్టేషన్ కి వెళ్ళాలి లేదంటే నా జాబ్ పోతుందని చెప్తుంది. రాజ్ అన్నయ్య హెల్ప్ కావాలా అని కళ్యాణ్ అంటాడు. అదే సమయంలో రాజ్, కావ్య ఇద్దరు శోభనానికి ఏర్పాట్లు చేస్తుంటారు. తరువాయి భాగంలో అప్పు, కళ్యాణ్ బయటకు వెళ్తారు. శోభనం గదిలో రాజ్, కావ్య ఉంటారు‌. అప్పుడే ధాన్యలక్ష్మి లోపలికి వస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.