English | Telugu

Brahamamudi : రాజ్ ని చూసి కావ్య ఎమోషనల్.. నిజం చెప్పేసిన అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -809 లో..... కావ్య రిజెక్ట్ చేసిందని తాగుడుకి బానిస అవుతాడు రాజ్. తాగి రోడ్డుపై పడి ఉంటే రాజ్ ని కావ్య చూస్తుంది. రాజ్ ని ఆ సిచువేషన్ లో చూస్తూ కావ్య ఏడుస్తుంది. డ్రైవర్ సాయంతో రాజ్ ని కార్ లోకి ఎక్కించుకొని యామిని ఇంటికి తీసుకొని వెళ్తుంది కావ్య.

రాజ్ ని కావ్య తీసుకొని రావడం చూసి యామిని షాక్ అవుతుంది. రాజ్ ని తీసుకొని వెళ్లి బెడ్ పై పడుకోబెడుతుంది. కావ్య బయటకు వచ్చి మౌనంగా వెళ్తుంటే.. ఏంటి కళావతి రాజ్ ని ఈ సిచువేషన్ లో చూడలేకపోతున్నావా అని కావ్య బాధపడేలా యామిని మాట్లాడుతుంది. యామిని మాటలకి సమాధానం చెప్పి కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కావ్య ఇంటికి వెళ్లి అపర్ణ, ఇందిరాదేవీలకి జరిగిందంతా చెప్తుంది. వాళ్ళు బాధపడుతారు. వెంటనే రాజ్ దగ్గరికి బయల్దేర్తారు.వాళ్ళు వెళ్లేసరికి రాజ్ తాగి మెట్లపై తలకిందులుగా పడుకొని ఉంటాడు.

రాజ్ ని ఆ సిచువేషన్ లో చూసి వాళ్ళు బాధపడుతారు. వాళ్ళని రాజ్ చూసి అబ్బో ఇద్దరు పెద్ద రాయుడులు వచ్చారు.. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పడానికి అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్యనే తన భార్య అని రాజ్ కి చెప్తుంది అపర్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.