English | Telugu

కట్టప్ప లేకుండా బాహుబలి లేదు...ఆదిరెడ్డి లేకుండా బిగ్ బాస్ సీజన్ 6 లేదు


బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ రేవంత్ గురించి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, మంచి సింగర్ గా అందరికీ పరిచయమే. రేవంత్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసాడు. " హౌస్ లో నేను సెంటిమెంట్ కోసమో ఇంకా దేని కోసమే గేమ్ ఆడలేదు..స్పెషల్ గా కంటెంట్ ఇవ్వడానికి కూడా నేనెప్పుడూ ట్రై చేయలేదు. హౌస్ లోకి వెళ్లడానికి ముందు నాకు ఆదిరెడ్డి ఎవరో తెలియదు. అక్కడికి వెళ్లాకే ఆయనతో పరిచయమయ్యింది. దేవుడిచ్చిన మంచి ఫ్రెండ్ ఆదిరెడ్డి.

ఆదిరెడ్డి బిగ్ బాస్ షోకి చాలా కష్టపడి వచ్చాడు. జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడతారు. కానీ ఆదిరెడ్డికి ఉన్నన్ని కష్టాలు మాత్రం ఎవరికీ రాకూడదు అని నేను అనుకుంటాను . ఆదిరెడ్డి ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీ గురించే మాట్లాడేవాడు. ఎవరికైనా సరే హెల్ప్ చేసే వ్యక్తి తను.. కట్టప్ప లేకుండా బాహుబలి సినిమా ఎలా అర్ధం కాదో.. ఆదిరెడ్డి లేని బిగ్ బాస్ కూడా అంతే" అని అన్నాడు రేవంత్.

ఇక వెంటనే ఆదిరెడ్డికి కాల్ చేసిన యాంకర్ .. రేవంత్ గురించి ఒక మాట చెప్పమని అడిగేసరికి ఆదిరెడ్డి స్పందిస్తూ .. "రేవంత్ ను టఫ్ కంటెస్టెంట్ గా అందరూ భావించడం వల్లనే ఆయనలో తప్పులు వెతికేవాళ్లం. రేవంత్ కి ఉన్న కసి యూత్ లో ఉంటే జీవితాలే మారిపోతాయి" అంటూ చెప్పాడు ఆదిరెడ్డి..

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.