English | Telugu

స్టార్ యాంకర్ తో మంతనాలు చేస్తున్న బిగ్ బాస్..నెక్స్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్ చేయాలని..

బిగ్ బాస్ సీజన్ 6 మంచి రేటింగ్ రాకపోవడం, విమర్శలు ఎదుర్కోవడం వంటి వాటి కారణంగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 2017 లో స్టార్ట్ ఐన ఈ షో ఎంతో సక్సెస్ అయ్యింది. ఐతే బిగ్ బాస్ సీజన్- 6 అందుకు భిన్నంగా చాలా నిరుత్సాహపరిచింది.

ఈ సీజన్ లో ఫేక్ ఎలిమినేషన్స్, రాజకీయ ప్రలోభాల కారణంగా నిజాయితీగా ఆడిన కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఇక వీటన్నిటి వలన నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కి రానా దగ్గుబాటిని హోస్ట్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కొన్ని రోజుల నుంచి ఈ న్యూస్ ఇలా వైరల్ అవుతుంటే ఇప్పుడు మరో న్యూస్ తెర మీదకు వచ్చింది. అదే బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్, ప్రస్తుత స్టార్ యాంకర్ శ్రీముఖిని కలిశారంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

బిగ్ బాస్ మేకర్స్ ఎలాగైనా సీజన్ 7 కి గ్రాండ్ సక్సెస్ చేయాలనే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే హోస్ట్స్ వేట చాలా స్పీడప్ చేశారు. ఇకపోతే వచ్చే ఏడాది జులైలో ఈ సీజన్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.