English | Telugu
సూర్య పులిహోర.. బయట కూడా నలుగురికి ప్రపోజ్ చేసేశాడు!
Updated : Dec 15, 2022
"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లో లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో ఆర్జే సూర్య ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. ఇక ఇందులో సూర్యకు ఒక టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. లేడీస్ నుంచి వాసంతి, గీతూ, నేహా, ఆరోహిని రకరకాల హీరో వాయిసెస్ తో లవ్ ప్రొపోజ్ చేయాలని చెప్పింది.
ఇక ఈ టాస్క్ పేరు "సూర్య పులిహోర" అని పేరు పెట్టింది శ్రీముఖి. "ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నా కవులకు మాత్రం చందమామే కనపడుతుంది, నా చందమామ నువ్వు ..ఐ లవ్ యు వాసంతి" అని రాజశేఖర్ వాయిస్ తో ప్రొపోజ్ చేసాడు. ఇక తర్వాత గీతూ వచ్చేసరికి పుష్పలో అల్లు అర్జున్ వాయిస్ తో ప్రొపోజ్ చేసాడు. ఇక నేహాకి బాలయ్య బాబులా ప్రొపోజ్ చేసాడు.. "నీ వెంట తిరిగి ఫ్లవర్స్ ఇచ్చి ఐ లవ్ యు అని చెప్పినప్పుడు కన్నెత్తి చూడలేదు, నీకు ఇష్టమైన కేక్ ని పంపిస్తే కనీసం కత్తితో కొయ్యలేదు" అని చెప్పేసరికి "కేక్ పంపారు కానీ కత్తి పంపలేదు అంది నేహా. ఇదిగో కేక్ ని కొయ్యడానికి గొడ్డలి" అని ఇచ్చాడు సూర్య.
ఇక ఆరోహికి ఆర్జీవీ వాయిస్ తో ప్రొపోజ్ చేసాడు.."సి నేను గనులను, కత్తులను ఎంత ప్రేమిస్తానో అంతకంటే వన్ పర్సెంట్ ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా..ఐ లవ్ యు ..నాకు వెంటనే రిప్లై ఇవ్వొద్దు..ట్విట్టర్ లో టాగ్ చెయ్యి..చూసుకుందాం" అని చెప్పేసరికి స్టేజి మొత్తం నవ్వులే నవ్వులు.