English | Telugu

నిప్పంటుకుని చెల్లి చనిపోయింది.. రెండు రూపాయలతో నా సంపాదన మొదలయ్యింది

"ఆలీతో సరదాగా షో" లో ప్రతీ వారం ఆలీ ఎంతోమంది సెలెబ్రిటీస్ తీసుకొచ్చి వాళ్ళను మనకు పరిచయం చేయడం చూసాం. ఇక ఇప్పుడు తన షోలో తానే సెలెబ్రెటీగా మారి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. "మిమిక్రి చేస్తే వచ్చిన నా ఫస్ట్ ఇన్కమ్ రెండు రూపాయల కాగితం ఎర్రగా ఉండేది. ఇక ఆ టైంలో నేను మా అమ్మకు ఒక కండిషన్ పెట్టాను. అదేంటంటే మా అమ్మకు నాకు వచ్చిన రెండు రూపాయలు ఇచ్చేసాక ఆమె తిరిగి నాకు అర్ద రూపాయి ఇవ్వాలి అని. అలా రెండు రూపాయలతో మొదలైన నా సంపాదన తర్వాత ఐదు, తర్వాత పది, పదిహేను రూపాయలు అయ్యింది" అని ఆలీ చెప్పేసరికి "ఇప్పుడు ఎంత అయ్యింది అని చాలా ఆసక్తిగా సుమ అడిగింది.

ఆ ఎంతో కొంత అయ్యిందిలే, ఇప్పుడు నేను అడిగితే తర్వాత నా రెమ్యూనరేషన్ ఎంత అని నన్ను అడుగుతారు తరువాత వేరే వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతారు ఇదంతా ఎందుకులెండి అంది సుమ కనకాల. ఫస్ట్, సెకండ్ జెనెరేషన్స్ చూసారు మరి నాలాంటి థర్డ్ జనరేషన్ కూడా కూడా చూసారు అని సుమ పంచ్ వేసేసరికి ఆలీ షాకయ్యాడు. ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు, ఖయ్యూమ్, మీరు కాదా మొత్తం సంతానం కదా అని సుమ అడిగేసరికి ఖయ్యుమ్ కి ముందు ఒక చెల్లి పుట్టింది ఐతే తన చున్నీకి పొరపాటున నిప్పంటుని ఆమె చనిపోయింది" అని చెప్పి ఎమోషన్ అయ్యారు ఆలీ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.