English | Telugu
Prince Yawar : ఫైటర్‌లా ఆడు.. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి!
Updated : Nov 9, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పుడున్న వారిలో టాప్-5 లో ఒకడిగా యావర్ నిలిచాడనే చెప్పాలి. ఎనిమిది వారాల నుండి ప్రతీ గేమ్ లో తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు యావర్.
నిన్నటి ఎపిసోడ్ లో మొదట అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ వచ్చింది. ఆ తర్వాత శోభాశెట్టి వాళ్ళ అమ్మ వచ్చింది. కాసేపటికి యావర్ వాళ్ళ బ్రదర్ సుజా అహ్మద్ వచ్చాడు. "యావు.. మేరే బేటా కైసే హూ" అంటూ యావర్ బ్రదర్ సుజా అహ్మద్ వచ్చాడు. వచ్చీ రాగానే భయ్యా అంటూ యావర్ కాళ్ళ మీద పడ్డాడు. ఆ తర్వాత కౌగిలించుకొని ఏడుస్తూ ముద్దులు పెట్టేశాడు యావర్. ఆ తర్వాత ఒక్కొక్కరిని కలిసి మాట్లాడాడు. ముఖ్యంగా శివాజీ గట్టిగా పట్టుకుని.. మీరు యావర్ తో ఉన్నారు. మీరు నాకు బ్రదర్. ఐ లవ్ యూ లైక్ ఎనీథింగ్. యావర్ కి అండగా ఉన్నారు" అంటూ చెప్పాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీ అమ్మగారు యావర్ ని కొడుకు లెక్క అని అన్నారు. చాలా థాంక్స్ గౌతమ్, ఎందుకంటే యావర్ అమ్మని బాగా మిస్ అవుతున్నాడంటూ సుజా అహ్మద్ చెప్పాడు.
హౌస్ మేట్స్ అందరితో మాట్లాడిన యావర్ బ్రదర్ సుజా అహ్మద్.. కాసేపటి తర్వాత యావర్‌ని పక్కకి తీసుకెళ్లి మంచి మాటలు చెప్పాడు. " నువ్వు ఫైటర్ గుర్తుపెట్టుకో. టైగర్ వి. ఆటలో పక్కకి ఉండకు. గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్. ఒక ఫైటర్‌లా ఫైట్ చెయ్. నాకు ఆ కప్పు కావాలి. ఇక వేరే ఏం వద్దు. ఈ మధ్య నీ ఆటను చూసి నేను కొంచెం ఫీలయ్యాను. నువ్వు గెలవాలంతే. శివన్న ఉన్నాడుగా మంచివారు. చాలా బాగా గైడ్ చేస్తున్నారు. కెప్టెన్సీ ముందు ఉన్న యావర్ నాకు మళ్లీ కావాలి. అందరి ముందు చెప్పావ్ కదా ఫైటర్‌లా ఫైట్ చేస్తా అని అదే చెయ్. నీ అమాయకత్వం, నీ ప్రేమ అసలు వదులుకోకు. చాలా ముందుకు వెళ్తావ్ నువ్వు. నువ్వు ఎక్కడ దారి మారకు. నేను ఏం చెప్తున్నానో అది ఖచ్చితంగా పాటించు" అంటూ యావర్‌ని బాగా మోటివేట్ చేశాడు. కాసేపటికి శివాజీ, ప్రశాంత్ లతో యావర్ కి తోడుగా ఉన్నారు. మీకు థాంక్స్ అంటూ యావర్ వాళ్ళ బ్రదర్ సుజా అహ్మద్ అన్నాడు. వీళ్ళిద్దరి బాండింగ్ చూసి యావర్ కి మరింత ఫ్యాన్ బేస్ పెరుగుతుందనే చెప్పాలి.