English | Telugu

My Watch Ends Here: గీతు

నిన్న మొన్నటి దాకా బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టిన చిత్తూరు చిరుత గీతు రాయల్. ఎలిమినేషన్ తర్వాత హాట్ టాపిక్ గా మారింది. ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన పెద్దగా పట్టించుకోని బిగ్ బాస్ ప్రేక్షకులు. గీతు ఎలిమినేషన్ తర్వాత అసలు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది ఇక నుండి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూ, వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా గీతు తన సోషల్ మీడియా వేదికగా తను బిగ్ బాస్ లో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ , బయటకు వస్తానని అసలు ఊహించలేదంటు, బాగా మిస్ అవుతున్నట్టుగా పోస్ట్ చేసింది. కాగా ఫ్యాన్స్ ఇప్పుడు ఆ పోస్ట్ ని వైరల్ చేసారు. తను రాసిన పోస్ట్ లో గీతు రాయల్ ఇలా రాసుకొచ్చింది.

"బిగ్ బాస్ వాజ్ ది బ్యూటిఫుల్ లైఫ్. ఐ ఎవర్ లివ్డ్! కానీ అందులో నేను ఓడిపోయాను. మనుషుల విలువ తెలిసింది. నా తప్పులను క్షమించండి ప్లీజ్. నన్ను నన్నుగా అర్థం చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి చచ్చిపోయేంతవరకు ఋణపడతా! 'My Watch Ends Here'! " . కాగా తను రాసిన ఈ నోట్ కి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.