English | Telugu
ఐ మిస్ యు బిగ్ బాస్ అని కన్నీళ్లు పెట్టుకున్న ఆరియానా!
Updated : Dec 16, 2022
బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ కి వచ్చేసింది. గత సీజన్స్ కి వచ్చినంత రేటింగ్ కావొచ్చు, ఎంటర్టైన్మెంట్ కావొచ్చు ఏదీ కూడా ఈ సీజన్ లో కనిపించలేదు. ఇక "బీబీ కెఫె"కి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది.
బీబీ కెఫె లో అందరిని ఇంటర్వ్యూ చేసే ఆరియానాని ఇప్పుడు కాజల్ ఇంటర్వ్యూ చేసింది. "ఇన్ని ఎపిసోడ్స్ నువ్వు హోస్టింగ్ చేసావ్ కాబట్టి.. " అని కాజల్ అనేసరికి "ఇప్పుడు నన్ను రోస్ట్ చేస్తున్నావ్" అని కామెడీ చేసింది అరియనా. "ప్రతీ రోజు నువ్వు గెస్టులకు పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో ఈరోజు ఆ టార్చర్ నీకు పెట్టబోతున్నా" అంది కాజల్. "నేను హోస్ట్ గా ఉంటే గెస్ట్ కి టార్చర్..అదే నేను గెస్ట్ గా ఉంటే హోస్ట్ కి ఫ్రాక్చర్" అని పంచ్ వేసింది ఆరియానా.
"నాకు బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్, సొసైటీలో నాకు పేరు, ఐడెంటిటీ, రెస్పెచ్త్ వచ్చింది అంటే అది బిగ్ బాస్ వల్లనే.. దాని కోసం నేను ఎంతో కష్టపడ్డాను..బీబీ కెఫెని నేను నిజంగా మిస్ అవుతాను..ఐ మిస్ యు బిగ్ బాస్" అని కన్నీళ్లు పెట్టుకుంది ఆరియానా.