English | Telugu

మగ నవదీప్ కి ప్రపోజ్ చేసిన ఆడ నవదీప్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష మూడో రోజు సెలెక్షన్స్ లో ఆడ నవదీప్ ఒక రేంజ్ లో మగ నవదీప్ ని పడేసింది. నిజంగా ఈ సీన్ ని ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేశారు. శ్వేతా హైదరాబాద్ నుంచి వచ్చింది. ఉండేది యూకే. చేసింది మాస్టర్స్. ఈమె చాలా ఇంటరెస్టింగ్ కాండిడేట్ అని జడ్జెస్ కూడా ఫీలయ్యారు. ఇక జింజర్ షాట్స్ కొడుతూ తన ఇంట్రడక్షన్ ఇచ్చింది. అలాగే ఫింగర్స్ మీద ఒక కాలు పైకి లేపి పుషప్స్ కూడా చేసింది. మోడలింగ్ చేస్తూ ఉంటుంది..అలాగే బిజినెస్ చేస్తూ ఉంటుందని చెప్పింది. ఇక తన తల్లి ఒక కాన్సర్ పేషెంట్ అని, ఐతే తనతో టైం స్పెండ్ చేయాలి కానీ.. బిగ్ బాస్ హౌస్ లో కామనర్స్ కి మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందో రాదో అని తెలిసి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఉండడం కోసం వచ్చినట్లు చెప్పింది.

"శ్వేతా రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి మనది" అని బిందు మాధవి అడిగేసరికి "నేను ఆడ నవదీప్ ని" అని చెప్పింది. అంతే ఇక జడ్జ్ నవదీప్ బాగా కనెక్ట్ ఐపోయాడు. ఇంతవరకు ఎవరూ ఇలా చెప్పింది లేదు. ఫస్ట్ టైం ఒక ఆడ నవదీప్ ఒక మగ నవదీప్ ని ప్రపోజ్ చేయబోతోంది అంటూ శ్రీముఖి చెప్పింది. శ్వేతా రెడ్ రోజ్ తీసుకుని "నేను గౌతమ్ ఎస్.ఎస్.సి. చూసాను అక్కడ బాగా నచ్చారు. కానీ తర్వాత మళ్ళీ ఇంటరెస్ట్ పోయింది. మళ్ళీ చందమామ టైములో బాగా నచ్చారు. తర్వాత ఐస్ క్రీం మూవీలో మళ్ళీ ఇంటరెస్ట్ పోయింది. నాకు మీ ఫిలిమ్స్ తప్ప మీ ప్రపంచం తెలీదు. మిమ్మల్ని ప్రేమించాలి అంటే మీ ఫిలిం ప్రపంచాన్ని ప్రేమించాలి. అందుకే అలా చెప్తున్నా ఏమీ అనుకోకండి. ఓకే నవదీప్ లేట్ ఐతే అయ్యింది. కానీ లేటెస్ట్ గా స్టార్ట్ చేద్దాం. డోంట్ వర్రీ ప్రతీ ఒక్కళ్లకు ఒక రోజు వస్తుంది. నీకు ఒక రోజా వచ్చింది" అంటూ శ్వేతా తెగ సిగ్గుపడిపోయింది. "ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలీదు కానీ ప్రస్తుతానికి ఈ రోజాతో సర్దుకుంటున్న" అన్నాడు నవదీప్. ఇక ముగ్గురు జడ్జెస్ కలిసి గ్రీన్ ఇచ్చేసారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.