English | Telugu

బిగ్ బాస్ విన్నర్ అతడేనా..‌గట్టి పోటీ ఇస్తున్న నబీల్!

బిగ్ బాస్ సీజన్-8 తుదిదశకు చేరుకుంది. హౌస్ లో ప్రస్తుతం అవినాష్, నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్ ఉన్నారు. స్టార్ మా పరివార్ నుండి ఒక్కో సీరియల్ కి సంబంధించిన నటీనటులు రావడం.. వారితో ప్రైజ్ మనీని పెంచడానికి టాస్క్ లు జరిపించడం జరుగుతుంది.

ఇక మరోవైపు టాప్-5 లోని వారికి ఓటింగ్ జరుగుతుంది. ‌వీరిలో ప్రస్తుతం అవినాష్ , ప్రేరణ చివరి రెండు స్థానాలలో కొనసాగగా.. మొదటి మూడు స్థానాల కోసం నబీల్,‌నిఖిల్, గౌతమ్ ల మధ్య గట్టి పోటీ జరుగుతుంది. అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో ఎక్కడ చూసినా నిఖిల్, గౌతమ్ టాప్-2లో కొనసాగగా.. నబీల్ మూడవ స్థానంలో ఉన్నాడు. గౌతమ్ కి 34శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా.. నిఖిల్ 32 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నబీల్ 30 శాతంతో మూడో స్థానంలో ఉండగా..అవినాష్ 20శాతం, ప్రేరణ 16 శాతం ఓటింగ్ జరిగింది.‌ ఇంకా ఒక్కరోజు మాత్రమే ఓటింగ్ ఉండటంతో తమ కంటెస్టెంట్స్ కి విపరీతంగా ఓట్లు వేస్తున్నారు అభిమానులు. అయితే నిన్న మొన్నటిదాకా నిఖిల్ కి ఓటింగ్ భారీగానే ఉన్నా.. నిన్నటి నుండి గౌతమ్, నబీల్ ల ఓటింగ్ పెరిగింది నిఖిల్ ఓటింగ్ తగ్గింది. దీంతో ఈ ముగ్గురి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. ‌నబీల్ కి గత రెండు రోజుల్లో ఓటింగ్ దాదాపు పది నుండి పదిహేను శాతం పెరిగింది.

బిగ్ బాస్ ముగియడానికి ‌మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో ఈ సీజన్ ఎవరు విన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ప్రస్తుతం కన్నడ వర్సెస్ తెలుగు వార్ జరుగుతుంది. అందుకే గౌతమ్, నబీల్, నిఖిల్ ల మధ్య ఓటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ లైన్స్ ముగుస్తాయి. అందుకే మీకు నచ్చిన కంటెస్టెంట్ కి మీరు ఓట్ చేస్కోండి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.