English | Telugu

శివాజీ టార్గెట్ అమర్ దీప్.. బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ అదుర్స్!!

శివాజీ టార్గెట్ అమర్ దీప్.. బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ అదుర్స్!!

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 ఇప్పటికే రసవత్తరంగా సాగుతోంది. సోమవారం నాటి నామినేషన్లతో బిగ్‌బాస్‌ హౌజ్‌ హీటెక్కింది. ఇప్పటికె రెండు వారాలు పూర్తి చేసుకొని మూడవ వారంలోకి అడుగుపెట్టారు కంటెస్టెంట్స్‌. కాగా, అందులో ఆట సందీప్‌, శివాజీ ఇద్దరూ పవరస్త్రని సాధించి కన్‌ఫర్మ్‌ హౌజ్‌ మేట్స్‌గా నిలిచారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ నుంచి మొదటివారం కిరణ్‌ రాథోడ్‌, రెండోవారం షకీలా ఎలిమినేట్‌ అయ్యారు. 

కాగా, మూడవవారం హౌజ్‌ నుండి ఎవరు బయటకెళ్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సీరియల్‌ బ్యాచ్‌ అంతా మళ్లీ ఒక్కటయ్యారు. అదే ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్‌, శోభా శెట్టి ఒకరికొకరు నామినేట్‌ చేసుకోకుండా వేరే కంటెస్టెంట్స్‌ని నామినేట్‌ చేశారు. ప్రిన్స్‌ యావర్‌ని దామిని నామినేట్‌ చేసింది. సిల్లీ రీజన్‌ చెప్పడంతో యావర్‌ నామినేషన్‌ని యాక్సెప్ట్‌ చేయలేకపోయాడు. ‘ఆరోజు గౌతమ్‌కృష్ణకి, నీకు మధ్య జరిగిన గొడవలో నువ్వు అంత డ్రామా క్రియేట్‌ చేయనవసరం లేదు’ అంది దామిని. దాంతో యావర్‌ రెచ్చిపోయాడు. ‘అలా ఎలా మాట్లాడతావ్‌? నీ మాటలు వెనక్కి తీసుకో’ అని దామినిని అడిగాడు యావర్‌. ‘నేను తీసుకోను’ అంది దామిని. ఇలా ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది. 

ఆ తర్వాత ప్రియాంక జైన్‌ని శుభశ్రీ నామినేట్‌ చేసింది. దాన్ని ప్రియాంక యాక్సెప్ట్‌ చెయ్యలేదు. కుకింగ్‌ విషయంలో వీళ్ళిద్దరి మధ్య మరింత మాటల యుద్ధం జరిగింది. ఇక నామినేషన్లు అందరూ చేశాక, బిగ్‌ బాస్‌ ఉల్టా పల్టా చేశాడు. నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ నుంచి ఒకరిని నామినేషన్‌లోకి తీసుకురావాలంటూ, నామినేషన్‌లో ఉన్న ఒకరిని సేవ్‌ చేయాలంటూ సేఫ్‌ జోన్‌లో ఉన్న ఆట సందీప్‌, శివాజీలకి బిగ్‌ బాస్‌ చెప్పాడు. ఇద్దరూ చాలాసేపు డిస్కస్‌ చేసుకొని అమర్‌దీప్‌ని నామినేట్‌ చేశారు. దాంతో అమర్‌దీప్‌ ఫుల్‌ ప్రస్ట్రేట్‌ అయ్యాడు. శివాజీ తనపట్ల పక్షపాతం చూపించాడంటూ అతనితో వాగ్వాదానికి దిగాడు అమర్‌దీప్‌. దీంతో అమర్‌దీప్‌కి నెగెటివ్‌ పెరిగింది. ఈసారి నామినేషన్‌లో జరిగే ఓటింగ్‌లో చివరి స్థానంలో అమర్‌దీప్‌ ఉంటాడని తెలుస్తోంది.