English | Telugu
బిగ్‌బాస్ బండారం బయటపెట్టిన రవి
Updated : Dec 9, 2021
12 వ వారం అనూహ్యంగా యాంకర్ రవి ఎలిమినేట్ కావడం పలువురిని షాక్ కు గురిచేసిన విషయం తెలిసిందే. ఇది రవిని కూడా షాక్ కు గురిచేసిందట. దీంతో రవి ఫ్యాన్స్ ఇది అక్రమం, అన్యాయం అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ధర్నాకు దిగడం తెలిసిందే. తరువాత తన ఎలిమినేషన్ విషయంలో అనుమానాలున్నాయని బిగ్‌బాస్‌పై విమర్శలు చేసిన యాంకర్ రవి హౌస్‌లో అసలు ఏం జరుగుతోందో.. బయటి ప్రపంచానికి ఏం చూపిస్తున్నారో క్లారిటీగా చెప్పేశాడు.
దీంతో బిగ్‌బాస్ పై విశ్వసనీయత పోయింది. తాజాగా మరోసారి యాంకర్ రవి బిగ్ బాస్ బండారం బయటపెట్టాడు హౌస్‌లో మీకు తెలియనివి చాలా జరిగాయి.. జరుగుతున్నాయి. కానీ ఆడియన్స్‌కి మాత్రం ఏది చూపించాలో అదే చూపిస్తున్నారు. మిగతా దాన్ని దాచేస్తున్నారు. దీంతో ఆడియన్స్‌ని కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆడియన్స్ హర్ట్ అయితే సోషల్ మీడియాలో రచ్చ అవుతుంది.. దాంతో పబ్లిసిటీ వస్తుంది.. ఇదే బిగ్‌బాస్ నిర్వాహకులు స్ట్రాటజీ.
శ్రీరామచంద్ర హౌస్‌లో ఏ పని చేసినా పాటలు పాడుతూనే చేస్తాడు కానీ చూపిస్తున్న ఎపిసోడ్స్‌లలో అతను పాటలే పాడటం లేదని చూపిస్తున్నారు. ఇది తెలిసి కూడా నాగ్ సర్ .. శ్రీరామ్ పాటలు ఎందుకు పాడటం లేదని అడుగుతున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది? ... ఏం చేయాలనుకుంటున్నారు... ఏం చూపిస్తున్నారు? .. జరిగింది టెలికాస్ట్ కానప్పుడు ఎవరైనా ఏం చేస్తారు అంటూ మరోసారి తన ఆవేదనని వ్యక్తం చేశాడు యాంకర్ రవి.