English | Telugu
నందు క్షమించని అడగడంతో కరిగిపోయిన భవాని!
Updated : Jul 25, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -217 లో.. కృష్ణ, మురారి గదిలో మాట్లాడుకుంటారు. ముకుంద వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి.. నీతో మాట్లాడాలి మురారి అని అంటుంది. అది విని కృష్ణ.. వెళ్ళండి ఏసీపీ సర్ అని అంటుంది. అలా అనగానే మురారి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తుంది ముకుంద. ఏంటి ముకుంద ఇలా టీనేజ్ పిల్లలాగా చేస్తున్నావని మురారి కోప్పడుతాడు
ఆ తర్వాత ముకుంద, మురారి చెయ్యి పట్టుకొని భవాని గది ముందు ఆగి.. నీ చెయ్యి నా చేతిలో ఉంది ఇలా భవాని అత్తయ్య చూస్తే అని లోపలికి వెళ్తుంది. అత్తయ్య నాకు మురారికి ఒక టాపిక్ పై ఆర్గుమెంట్ జరిగింది. అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి అసలు అగ్రిమెంట్ మ్యారేజ్ అంటే ఏంటి అత్తయ్య అని ముకుంద కావాలనే మురారిని టెన్షన్ పెట్టడం కోసం భవానిని అడుగుతుంది. అసలు అగ్రిమెంట్ మ్యారేజ్ ఏంటి? మీకెందుకు ఆ టాపిక్ వచ్చిందంటూ కోప్పడి ఇద్దరిని అక్కడ నుండి పంపిస్తుంది. భవాని గదిలో నుండి ముకుంద వచ్చాక.. ఇది ట్రైలర్ మాత్రమే అని మురారితో అంటుంది. ఏంటి కృష్ణ ఆపిల్స్ పికిల్ పెట్టుకొని తింటావా అని అడుగుతాడు. అయ్యో మీకు ఆలా అర్థం అయిందా అని కృష్ణ నిరాశ అవుతుంది.
ఆ తర్వాత ఇంట్లో అందరు రెడీ అవుతారు. అందరూ కలిసి భోజనం చేస్తూ సన్మానానికి ఎవరెవరు వస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుంటారు. నందు, గౌతమ్ ఇద్దరు వస్తున్నారని భవానితో కృష్ణ చెప్పగానే.. ఫస్ట్ కోపంగా చూస్తుంది భవాని. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది. వాళ్ళని తీసుకొని రావడానికి కార్ పంపించలా అని భవాని అనడంతో అందరు సంతోషపడతారు. నేను నందుని వెళ్లి తీసుకొని వస్తానని మురారి అనగానే.. భవాని ఆశ్చర్యంగా చూస్తుంది. నందు నా చెల్లి కాబట్టి అని మురారి అనగానే.. భవాని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత అందరు సన్మానం జరిగే దగ్గరికి వెళ్తారు. భవాని దగ్గరికి నందు వచ్చి అమ్మ అని పిలుస్తుంది. నందుని హత్తుకొని భవాని ఎమోషనల్ అవుతుంది. అమ్మ నేను తప్పు చేసాను నన్ను క్షమించు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గౌతమ్ నన్ను బాగా చూసుకుంటున్నాడు. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తానని నందు అంటుంది. అలా నందు అనగానే భవాని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.