English | Telugu
రిషి, వసుధారల మౌన పోరాటం.. మీటింగ్ లిస్ట్ నుండి శైలేంద్రని తప్పించిన జగతి!
Updated : Jul 25, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -823 లో.. వసుధార, ఏంజెల్ కలిసి రిషిని భోజనానికి పిలవడానికి వెళ్తుంటే.. రిషి వాళ్ళకి ఎదురుగా వస్తాడు. వసుధార కూడా భోజనం చెయ్యడానికి వస్తుందని తన మనసులో అనుకొని.. నేను భోజనం చెయ్యడానికి రాను. నా గదిలోనే తింటానని రిషి అంటాడు. ఆ మాటలు విన్న ఏంజిల్.. అసలేంటి నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదని రిషితో అంటుంది.
ఆ తర్వాత నాతో కలిసి భోజనం చెయ్యకూడదని, మీరు రావట్లేదు.. నాకు తెలుసు రిషి సర్ అని వసుధార తనలో తానే అనుకుంటుంది. అయిన తప్పు చేసినవాల్లే పక్కన కూర్చొని భోజనం చేస్తుంటే నాకెందుకు భయం. వాళ్ళకి నేను భయపడి గదిలో భోజనం చేయడం ఎందుకని రిషి అనుకుంటాడు. నేను గదిలోకి భోజనం పంపిస్తానని ఏంజిల్ అనగానే.. లేదు ఏంజిల్ నేను వస్తాను. అక్కడే భోజనం చేస్తానని రిషి అంటాడు. రిషి నువ్వు ఎప్పటికి అర్ధం కావని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. వెన్నెలని చూస్తూ భోజనం చేద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయా అని ఏంజిల్ అంటుంది. మనకు ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే.. ఎక్కడ తిన్నా తృప్తిగానే ఉంటుంది. మనకు కష్టమైన వాళ్ళు పక్కన ఉంటే ఎక్కడ తిన్న తిన్నట్టు అనిపించదని రిషి అంటాడు. సర్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్న అని విశ్వనాథ్ తో వసుధార అనగానే.. ఎందుకు అమ్మ మీ నాన్న గారు ఊళ్ళో లేరు కదా అని విశ్వనాథ్ అంటాడు. నాన్న గారు లేకుంటే వాళ్ళ అమ్మ ఉంటుంది కదా వెళ్లొచ్చు కదా అని రిషి తన మనసులో అనుకుంటాడు. సర్ వెళ్తానని మళ్ళీ వసుధార అంటుంది. ఇప్పుడు ఎందుకు నీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీ నాన్న వచ్చాక వెళ్ళు అని వసుధారతో విశ్వనాథ్ చెప్తాడు. మీరు ఒకరికొకరు చాలా హెల్ఫ్ చేసుకుంటారు. మాట్లాడుకోరు.. మీ ప్లేస్ లో ఎవరు ఉన్నా డీప్ కనెక్షన్ లో ఉంటారు కానీ మీ మధ్య అసలు కమ్యూనికేషన్ లేదని ఏంజెల్ అంటుంది. అలా ఏంజిల్ అనగానే ఇద్దరు సైలెంట్ గా ఉండిపోతారు. ఆ తర్వాత రిషికి మెసేజ్ చేస్తుంది వసుధార. మీరు ఆలా ఉంటే ఏంజిల్ కి డౌట్ వస్తుంది. అది మీకు మంచిది కాదు. నార్మల్ గా ఉండండి అని వసుధార మెసేజ్ చెయ్యగానే.. రిషి చూస్తాడు కానీ రిప్లై ఇవ్వడు.
మరొక వైపు ఇంట్లో మహేంద్ర చేసిన గొడవ గురించి శైలేంద్ర, దేవయాని మాట్లాడుకుంటారు. అప్పుడే కాలేజీ లెక్చరర్ ఫోన్ చేసి.. ఈ రోజు కాలేజీ లో బోర్డు మీటింగ్ ఉంది. లిస్ట్ లో మీ పేరు కూడా లేదని శైలేంద్రకు చెప్తాడు. ఆ తర్వాత శైలేంద్ర కోపంగా.. వీళ్ళేం చేస్తున్నారని శైలేంద్ర కాలేజీకి వెళ్తాడు. మరొకవైపు వసుధార కాలేజీకి వెళ్తుంటే.. అక్కడే ఉన్న రిషితో వసుధారని తీసుకొని వెళ్ళామని చెప్తాడు. ఆ తర్వాత నేను మీతో రావాలంటే నేను చెప్పింది చేస్తేనే వస్తానని వసుధార అంటుంది. ఏంటి చెప్పు అని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.