English | Telugu
అమ్మ రాకతో నబీల్ హ్యాపీ...నీ ఆట నువ్వు ఆడు!
Updated : Nov 13, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇక ఈ వీక్ అంతా హౌస్ మేట్స్ యొక్క అమ్మనాన్న, భార్య, ఫ్రెండ్స్ ఇలా ఎవరో ఒకరు వస్తారు. ఇదంతా ఫూల్ ఎమోషనల్ గా సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో రోహిణి వాళ్ళ అమ్మ, ఆమె అల్లుడు హౌస్ లోకి వచ్చారు. అలాగే నబీల్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి వచ్చింది.
నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా నబీల్ ని కన్ఫెషన్ రూమ్‌కి రండి అని బిగ్ బాస్ పిలిచాడు. ఎదురుగా హల్వా పెట్టాడు. ఇది చూసి ఇక్కడ హల్వా ఉంది.. కానీ ప్రేరణ ఆంటీ చెప్పింది తినొద్దని.. తినాలా ఇది.. అంటూ నబీల్ అన్నాడు. దీనికి ఐదు వారాలు మాత్రమే ఆట మిగిలున్న కారణంగా స్వీట్స్ తినకుండా ఉండాలనే రూల్‌ను రద్దు చేస్తున్నా.. స్వీట్స్ మొత్తం ఇక్కడే తినండి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో హల్వా మొత్తం లాగించేశాడు నబీల్. ఇది జరిగిన కాసేపటికే నబీల్ యాక్షన్ రూమ్‌కి రండి.. అంటూ అక్కడ మరో సెట్ స్వీట్లు పెట్టాడు. ఇది చూసి తినిపించి తినిపించి చంపేస్తారా నన్ను.. అంటూ నబీల్ జోక్ చేశాడు. మీరు స్వీట్లు తినడం బిగ్‌బాస్‌కి ఆనందంగా అనిపించింది.. అందుకే మీకోసం మళ్లీ పంపించారంటూ అనౌన్స్ చేశాడు. దీంతో ఇదే లాస్ట్ కదా బిగ్‌బాస్.. తింటా అట్లేం లేదంటూ నబీల్ అవి తినే పనిలో పడ్డాడు. ఇక ఇక్కడ నబీల్ స్వీట్లు తింటుంటే మెయిన్ గేట్ నుండి నబీల్ వాళ్ళ అమ్మ హౌస్ లోపలికి వచ్చింది. ఇక నబీల్ అదంతా అక్కడ ఉన్న టీవీలో చూసి అమ్మ అంటూ ఎమోషనల్ అయ్యాడు. డెబ్బై రోజులైంది బిగ్ బాస్ అమ్మని చూడక.. ఇప్పుడు చూస్తుంటే కన్నీళ్ళు ఆగుతలేవు బిగ్ బాస్ అంటూ నబీల్ చెప్పుకుంటూ ఏడ్చేశాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యాడు.
ఇక నబీల్ మరియు వాళ్ల అమ్మ ఇద్దరే మాట్లాడుకున్నారు. నేనెలా ఆడుతున్నా.. ఏం అనిపిస్తుందని నబీల్ అడుగగా.. నీ ఆట నువ్వు ఆడు.. ఎవరి గురించీ పట్టించుకోవద్దు.. ఎవరో ఏదో అన్నారని ఏం ఫీల్ కాకు.. అందరితో మంచిగానే ఉండు.. అంటూ ఇండైరెక్ట్‌గా కే (కన్నడ) బ్యాచ్ గురించి నబీల్‌కి హింట్ ఇచ్చింది. ఇక తన బెడ్ దగ్గర ఉన్న షీల్డ్ గురించి కూడా నబీల్ చెప్పాడు. ఎట్ల అనిపిస్తుంది బయట నా ఆట.. కనిపిస్తున్నానా నేను టీవీలో ఎక్కువ సేపు అంటూ నబీల్ అడిగితే.. బాగా ఆడుతున్నావ్.. రోజూ కనిపిస్తున్నావ్ అని చెప్పింది. ఇక నబీల్ వాళ్ళ అమ్మ హౌస్ మేట్స్ అందరికి గులాబ్ జామ్ లు తీసుకొచ్చింది. అందరు షేర్ చేసుకున్నారు. ఇక నబీల్ వాళ్ళ అమ్మ అతడి కోసం ఓ గేమ్ ఆడి బయటకొచ్చేసింది.