English | Telugu

త్రినయని సీరియల్ కి శుభం కార్డ్ పడనుందా.. ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!


జీతెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ లో త్రినయని టాప్-5 లో ఉంది. అయితే ఈ సీరియల్ త్వరలో ముగుస్తుందనే వార్తలొస్తున్నాయి. జీతెలుగులో అత్యధిక రేటింగ్ వచ్చే సీరియల్స్‌లో త్రినయని ఒకటి. ఈ సీరియల్ ప్రారంభం నుంచి కూడా మంచి టీఆర్పీ రేటింగ్‌ను సాధిస్తోంది. గత వారం ఈ సీరియల్‌‌కి 6.62 రేటింగ్ వచ్చింది. పడమటి సంధ్యారాగం సీరియల్‌ 8.49 రేటింగ్‌తో టాప్‌లో ఉంటే.. మేఘ సందేశం 7.98 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. నిండునూరేళ్ల సావాసం 7.87 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉంటే.. జగద్ధాత్రి 7.02 రేటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక త్రినయని 6.62 రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచింది.

త్రినయని సీరియల్ లో అషిక పదుకొనే (Ashika Padukone) త్రినయని పాత్రలో నటిస్తుండగా.. చందు బి గౌడ (Chandu B Gowda) విశాల్‌గా త్రినయని భార్తగా చేస్తున్నారు. చైత్రా హలికేరి.. తిలోత్తమగా కీలకపాత్రలో కనిపించింది. ఈ సీరియల్ ప్రారంభం నుంచి త్రినయని పాత్ర ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ సీరియల్ గత నాలుగేళ్ళుగా జీ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతోంది. అయితే తాజాగా ఈ సీరియల్ టైమ్ మారుతోందంటూ అప్డేట్ వచ్చేసింది. సోమవారం నుంచి శనివారం వరకూ రాత్రి 8.30 గంటలకు ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ని.. కొత్త ఏడాది జనవరి 01 నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు మార్చేశారు.

జనవరి 1 నుంచి జీ తెలుగులో రాత్రి 8.30 గంటలకు ‘చామంతి’ (Chamanthi Serial Zee Telugu) అనే కొత్త సీరియల్ ప్రసారం కానుంది. దాంతో త్రినయని సీరియల్ మధ్యాహ్నం 2.30 గంటలకు మారింది. అయితే మధ్యాహ్నం 2.30 గంటలకు జీ తెలుగులో జానకి రామయ్య గారి మనవరాలు (Janaki Ramayya Gari Manavaralu Serial) ప్రసారం అవుతోంది. మరి ఆ సీరియల్‌ని మరో స్లాట్‌కి మారుస్తారా? లేదంటే సీరియల్‌ని ముగించేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జీతెలుగులో‌ అత్యధిక టీఆర్పీ పొంతున్న ఈ సీరియల్ టైమింగ్ చేంజ్ చేయడంపై అభిమానులు తీవ్రంగా నిరాశని వ్యక్తం చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.