English | Telugu

 డైలాగ్ రైటర్ గా ఈ మూవీ టైటిల్ కార్డు మీద నా పేరు పడింది

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో ఫుల్ జోష్ గా కలర్ ఫుల్ గా సాగిపోయింది. ఈ షోకి "బూటకట్ బాలరాజు" మూవీ టీం నుంచి డైలాగ్ రైటర్స్ ఆటో రాంప్రసాద్, రాకేష్, సోహైల్, మేఘలేఖ, సిరి హన్మంత్, ఇంద్రజ, బాబు, డైరెక్టర్ శ్రీ కోనేటి, కమెడియన్ బాబు వచ్చారు. స్టేజి మీదకు టీం రాగానే "ఇక్కడికి రామ్ ప్రసాద్ గారు ఎందుకొచ్చారు" అని రష్మీ అడగడంతో "ఈ షోకి ఇప్పుడు నేను కూడా గెస్ట్ గా వచ్చాను...కొంచెం వేల్యూ ఇవ్వరా.." అని రాంప్రసాద్ చెప్పడంతో "మీరు చెప్పండి ఈ రాంప్రసాద్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు" అని డైరెక్టర్ ని అడిగింది రష్మీ " ఈ మూవీలో డైలాగ్స్ రాయడానికి ఎంతో హెల్ప్ ఐన పర్సన్."అని చెప్పారు. "డైలాగ్ రైటర్ రాంప్రసాద్ అని ఈ సినిమాతో టైటిల్ కార్డు కూడా వచ్చింది" అని చెప్పేసరికి రష్మీ కంగ్రాట్స్ అని చెప్పింది.

ఈ మూవీలో ఇంద్రజ క్యారెక్టర్ పేరు ఇంద్రావతి పటేలమ్మ...మనసు చంపుకుని బతుకుతారు కానీ మాట తప్పి బతకరు..అనే రోల్ లో బాగా చేశారు ..మేడం ఒక డైలాగ్ చెప్పండి ఇంద్రజ గురించి రాంప్రసాద్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. "ఈ పటేలమ్మకు మొదటి మాట, ఆఖరి మాట ఉండ...ఒక్కటే మాట" అని పంచ్ డైలాగ్ చెప్పారు. డిజె టిల్లు, జాతిరత్నాలు ఏ స్థాయిలో ఉంటాయో మూవీ అదే రేంజ్ లో ఈ బూటకట్ బాలరాజు మూవీ ఉంటుంది" అని చెప్పాడు. "సరే మీరు మాకు ఒకటి ప్రామిస్ చేయాలి. సినిమా సక్సెస్ అయ్యాక అందరూ కలిసి బూట్ కట్ ప్యాంట్స్ లో రావాలి." అని రష్మీ ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి ప్రామిస్ తీసుకుంది. "ఒకవేళ మూవీ బ్లాక్ బస్టర్ ఐతే మాత్రం ప్యాంట్లు లేకుండానే వచ్చేస్తాం" అంటూ ఫన్నీ డైలాగ్ చెప్పాడు రాంప్రసాద్. "అప్పుడు బూటుకట్టు వేసిన బుల్లేమో" అనే సాంగ్ వస్తుంది అంటూ" సోహైల్ ఇంద్రజని ఆటపట్టించాడు. బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌ ‘లక్కీ లక్ష్మ‌ణ్’ , ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు వంటి మూవీస్ లో నటించాడు. ఈ మధ్య కాలంలో మూవీస్, వెబ్ సిరీస్ అన్నీ కూడా రకరకాల టైటిల్స్ తో వస్తున్నాయి. ఎప్పుడూ వినని వాటినే యూనిక్ గా ఉండడానికి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి టైటిల్స్ ని పెట్టి మూవీస్ తీస్తున్నారు. మరి అలాంటి యూనిక్ టైటిల్ తో వస్తున్న ఈ "బూట్ కట్ బాలరాజు" మూవీ ఎలా ఉంటుందో చూడాల్సిందే..


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.