Read more!

English | Telugu

ఆటో రాంప్రసాద్ కి బ్రెయిన్ ట్యూమర్... క్లారిటీ!


జబర్దస్త్ లో ఫుల్ ఫేమస్ ఐన కమెడియన్స్ లో ఆటో రాంప్రసాద్ కూడా ఒకరు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ ఈ ముగ్గురు జోడి బుల్లితెర మీద సూపర్ హిట్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ అంటే వీళ్లదే అన్నట్టుగా ఉంటుంది. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. కిర్రాక్ ఆర్పీ రీసెంట్ గా ఓపెన్ చేసిన తన కర్రీ పాయింట్ సెకండ్ బ్రాంచ్ కి రాంప్రసాద్ వచ్చాడు. అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పాడు. తనకు కోరమీను, రాగి సంకటి ఇస్తామని చెప్పాడు. అక్కడ ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు.

 "ఆర్పీకి జబర్దస్త్ లో కంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యాడు. టేస్ట్ చాలా బాగుంది..మా ఇంటికి కూడా చాలా దగ్గర.. టేస్ట్ బాగుంది కాబట్టే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసాడు. మా ఫ్రెండ్ కాబట్టి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ముందు మేము ఫ్రెండ్స్ తర్వాత మిగతా విషయాలు..సుధీర్ ఏదో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే ఈ బ్రాంచ్ ఓపెనింగ్ కి రాలేకపోయాడు.  జబర్దస్త్ రీయూనియన్ అవ్వాలని నేను కోరుకుంటున్నా..కానీ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఇపోయారు. నాకు రైటర్ కావడం ఇష్టం. రీసెంట్ గా ఒక వెబ్ మూవీ చేసాను. నా హెల్త్ గురించి మీకు తెలియనిది ఏముంది..మీరే రాస్తారు కదా. థంబ్ నైల్ ఏదో పెడతారు.

ఆడియన్స్ లోపలి వెళ్లి చూస్తే అక్కడ అసలు కంటెంట్ ఏమీ ఉండదు. నేనేదో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే నాకేదో బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి ఏదేదో రాసేశారు..ఇంతకుమించి ఇంకేమీ రాయద్దు. అక్కడ ఏమీ లేదు." అని చెప్పాడు.