English | Telugu

స్టేజ్ మీదే 'జబర్దస్త్' కమెడియన్ పై దాడి!

బుల్లితెర కామెడీ షోలలో 'జబర్దస్త్' టాప్ రేసులో దూసుకుపోతోంది. ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్లలో వెంకీ ఒకరు. అమ్మాయిలను వేధిస్తున్నాడనే ఆరోపణలతో వెంకీను స్టేజ్ మీదే కొట్టడానికి కొందరు ప్రయత్నించడం హాట్ టాపిక్‌గా మారింది. మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన వెంకీ.. ఎన్నో ఈవెంట్‌లలో తన కామెడీతో ఆకట్టుకున్నాడు.

తన టాలెంట్ తో 'జబర్దస్త్' షోలో ఛాన్స్ కొట్టేశాడు. అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్ లీడర్‌గా ఎదిగాడు. ఇదిలా ఉండగా.. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల 'రెచ్చిపోదాం బ్రదర్' అనే షోను మొదలుపెట్టారు. దీనికి నటుడు రాజీవ్ కనకాల జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో కమెడియన్స్ తో పాటు స్టూడెంట్స్ కూడా రచ్చ చేస్తున్నారు.

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఓ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. కొందరు వెంకీ కోసం ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజీవ్ కనకాల ముందే వాళ్లంతా గొడవకు దిగారు. వాళ్లతో పాటు సదరు యువతి కూడా అక్కడకు వచ్చింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు వెంకీపై దాడికి దిగినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇదంతా నిజమో..? లేక మల్లెమాల పబ్లిసిటీలో భాగమో తెలియాల్సి వుంది!

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...