English | Telugu

ఆర్జీవీ అమ్మాయిల‌ను వేధించే టైపు కాదు.. ఆయ‌న‌పై ఎవ‌రైనా ఫిర్యాదు చేశారా?

గ‌తంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ద్వారా పాపులారిటీ దక్కించుకుంది అరియానా. ఈ ఇంటర్వ్యూ కారణంగానే ఆమెకి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఛాన్స్ వచ్చింది. ఈ షోలో ఆమె తన ప్రవర్తనతో, ఆటతీరుతో అందరినీ మెప్పించింది. రీసెంట్ గా మరోసారి వర్మని ఇంటర్వ్యూ చేసి హాట్ టాపిక్ గా మారింది. వర్మతో కలిసి జిమ్ లో వ్యాయామాలు చేస్తూ దిగిన ఫోటోలను వదులుతూ మొదటి నుండే పక్కా ప్లాన్ గా ఈ ఇంటర్వ్యూపై బజ్ వచ్చేలా చేశారు.

దీంతో ఈ ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని జనాలు ఎదురుచూశారు. రీసెంట్ గా పూర్తి ఇంటర్వ్యూ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూపై చర్చలు జోరుగా నడుస్తున్నాయి. కొంత‌మంది స‌మాజాన్ని త‌ప్ప‌దోవ ప‌ట్టించే విధంగా ఆ ఇంట‌ర్వ్యూ ఉంద‌నీ, త‌న కూతురు కంటే చిన్న వ‌య‌సు అమ్మాయితో అత్యంత అభ్యంత‌ర‌క‌రంగా, అస‌హ్య‌క‌రంగా వ‌ర్మ మాట్లాడార‌నీ కొంత‌మంది విమ‌ర్శిస్తున్నారు. ఈ క్రమంలో అరియనా స్పందించింది. ఆర్జీవీతో అంతసేపు ఇంటర్వ్యూ చేయడమే ఓ పెద్ద టాస్ అని.. తనకు ఈ ఇంటర్వ్యూ ప్లస్ అవుతుందేమో కానీ ఆయనకు మాత్రం మామూలే అని చెప్పుకొచ్చింది .

అందరూ బోల్డ్ ఇంటర్వ్యూ అంటున్నారు కానీ అందులో బోల్డ్ ఏముందో తనకు అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చింది. ఒకవేళ ఆర్జీవీ అమ్మాయిలను వేధించే టైప్ అయితే.. ‘మీటూ’లో ఆయన పేరు ఉండేదిగా.. ఎవరన్నా ఆయనపై ఫిర్యాదు చేశారా..? అంటూ తన గురువుని సపోర్ట్ చేస్తూ మాట్లాడుకొచ్చింది. ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలంటే కోపగించుకోకూడదని.. కోపం వల్ల సాధించేదేమీ లేదు కాబట్టి రాజీ పడాల్సిందే.. అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...