English | Telugu
యాంకర్ రవి మొదటి రెమ్యునరేషన్.. ఎపిసోడ్‌కు 250 రూపాయలే!
Updated : Jun 25, 2021
లాక్ డౌన్ సమయంలో చాలా మంది తారలు యూట్యూబ్ ఛానెల్స్ తో బిజీ అయ్యారు. పలు రకాల వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో యాంకర్ రవి కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో తన భార్య, పాప వియాలతో కలిసి రవి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తోన్న వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా రవి మరో వీడియో పోస్ట్ చేశాడు.
ఇందులో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. 'నా గురించి నీకు.. నీ గురించి నాకు ఎంత తెలుసు..?' అనే కాన్సెప్ట్ తో భార్యతో కలిసి వీడియో చేశాడు. ఇందులో రవి-నిత్యల సంసార జీవితం గురించి ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఇంట్లో ఎవరికి కోపం ఎక్కువగా వస్తుంది..? అలా వచ్చిన సమయంలో వాళ్లిద్దరూ ఏం చేస్తారనే విషయాలు మాట్లాడుకున్నారు. నిత్యకు కోపం వస్తే రవి తన దగ్గరకు వచ్చి మాట్లాడాలని కోరుకుంటుందట.
ఇక రవి ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చాడు..? అతడి మొదటి రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలను నిత్య చెప్పలేకపోయింది. 2010లో మొదటిసారిగా లైవ్ షో చేశానని రవి చెప్పాడు. అంతేకాకుండా ఆ సమయంలో ఒక ఎపిసోడ్ చేస్తే రూ. 250 ఇచ్చేవారని.. అలా నెలలో ఎన్ని ఎపిసోడ్ లు చేస్తే అన్ని రూ. 250లు ఇచ్చేవారని చెప్పుకొచ్చాడు. ప్రేక్షకుల అభిమానంతో ఇక్కడ వరకు వచ్చానని చెప్పుకొచ్చాడు.