English | Telugu

అషు రెడ్డికి ఆర్జీవీ కారు గిఫ్ట్‌... పూజ చేసిన వేణుస్వామి!

బిగ్ బాస్ ద్వారా అలాగే ఆర్జీవీ ఇంటర్వ్యూస్ ద్వారా ఫుల్ పాపులరైన సోషల్ మీడియా స్టార్స్ లో అషు రెడ్డి ఒకరు. బిగ్ బాస్ తెలుగు 3లోకి అడుగు పెట్టిన అషు తన అందంతో, ఆటతో ఆకట్టుకుంది. రాహుల్ సిప్లిగంజ్‌తో చనువుగా ఉంటూ కవ్విస్తూ ఇంకా హైలైట్ అయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక చల్ మోహన్ రంగ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, పోకస్ వంటి మూవీస్ లో నటించింది.

సోషల్ మీడియాలో క్లిక్ ఇంతగా మూవీస్ లో క్లిక్ అవలేదు ఆషు.అలాంటి అష్షు ఈమధ్య కాలంలో ఫుల్ డైటింగ్ చేస్తూ జిమ్ చేస్తూ మంచి ఫిజిక్ తో అందరినీ ఆకర్షిస్తోంది. ఇక రీసెంట్ గా ఒక కార్ కూడా కొనేసింది. ఇక రచ్చ రవి ఆషుకి విషెస్ చెప్పాడు. " నా మనసుకు బాగా నచ్చిన నా స్నేహమా .. నీ ఎదుగుదల నాకెప్పుడు ఆనందాన్నిస్తుంది..నువ్వు అనుకున్న ప్రతి గమ్యాన్ని చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...


నా తరఫున నా శ్రేయోభిలాషులందరి తరఫున నీ కొత్త కారుకు శుభాకాంక్షలు... నువ్వు తలపెట్టే ప్రతి పనికి దీవెనలు.. లవ్ యు రా అషు రెడ్డి...!!! " అని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. సుమారు 65 లక్షలు ఖరీదు చేసే రేంజ్ రోవర్‌ను కనుగోలు చేసి పాపులర్ జ్యోతిష్కుడు వేణు స్వామితో పూజలు చేయించింది. ఇక నెటిజన్స్ అంతా విషెస్ చెప్పడంతో పాటు ఆర్జీవి గిఫ్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత వెటకారంగా కామెంట్ చేసిన అష్షు మాత్రం ఆ కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోదు..తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఇక వేణు స్వామితో పూజల అనంతరం ఆ వీడియోని పోస్ట్ చేసి ‘మనల్ని అనుసరించే వాళ్లు మన సలహాలని పాటిస్తూ ముందుకు వెళ్లే వాళ్లని చూస్తే ఆ ఆనందం’ అంటూ టాగ్ లైన్ పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.