English | Telugu

స్కూల్ డేస్ లోనే లైంగిక వేధింపులు.. అన్నా అని పిలిచినా అలా చేసాడు

అంజలి అలియాస్ ఆరోహిరావు యాంకర్‌గా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అందరిని ఒక ఆట ఆడుకుంటోంది. చాలామంది అమ్మాయిల లాగానే తాను కూడా లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నట్లు చెప్పింది.

"నా మీద చిన్నప్పుడే రేప్ అట్టెంప్ట్ జరిగింది. చేతులు గట్టిగా పట్టుకుని అటూ ఇటూ నన్ను తోసేసరికి నన్ను కొడుతున్నాడనుకున్న. కానీ నాకు ఒక ఏజ్ వచ్చాక అర్ధమయ్యింది. ఆ రోజు అతను ఎందుకు అలా చేశాడా అని. మా ఊళ్ళో చిన్నప్పుడే మా బాబాయ్ వాళ్ళింట్లో ఉన్నప్పుడు వాళ్లకు సంబంధించిన అబ్బాయి ఇలా చేసాడు నన్ను. నేను అతన్ని అన్నా అని పిలిచేదాన్ని. ఇలా నా చిన్నప్పుడు నేను చాలా అవస్థలు పడ్డాను. స్కూల్లో కూడా నన్ను చాలా టార్చర్ పెట్టారు. రెండేళ్లు భరించాను. ఆడపిల్లలలకు ఎవరూ లేరు అంటే వాళ్ళను బద్నాం చేయాలనే చూస్తారు మగవాళ్ళు. అందుకే ఆ ఇన్సిడెంట్స్ అన్ని చూసి నాకు ఒకరకమైన ఫోబియా వచ్చేసింది. మగవాళ్ళతో మాట్లాడ్డం కోపం..వాళ్ళతో ఎక్కువగా ఉండలేను. కానీ ఇప్పుడు నేను చాలా మారాను అందరూ ఒకేలా ఉండరు కాబట్టి నా మంచి ఆలోచించేవాళ్లతో నేను చక్కగా ఉంటున్నాను. ఇల్లాంటి పరిస్థితుల్లోంచి ఎవ్వరైనా బయటికి రావాలంటే అది సెల్ఫ్ రియలైజెషన్ ద్వారా మాత్రమే అవుతుంది. పచ్చిగా చెప్తున్నా.. చాలామంది వాళ్లకి సంబంధించిన అశ్లీల వీడియోలు బయటికొచ్చాయని సూసైడ్ చేసుకుని చనిపోతుంటారు. వీడియోలు బయటికొస్తే నువ్ చనిపోవాలని ఎందుకు అనుకోవాలి. తప్పు నువ్వు చేయలేదు కదా ఎవడో బలిసినోడు చేసిన పనికి నువ్వెందుకు బలవ్వాలి. మన చుటూ ఉన్న ప్రపంచం గురించి అస్సలు ఆలోచించకూకాదు. మన బుర్రలో ఒకటే ఉండాలి.. తప్పు నాది కాదు అని." అంటూ ఆరోహి రావు ఒక ఇంటర్వ్యూలో ఎంతోమంది అమ్మాయిల కోసం ఒక మోటివేషన్ ని అందించింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.