English | Telugu
ఫినాలే అస్త్ర రేస్ లో పల్లవి ప్రశాంత్.. అంబటి అర్జున్ అవుట్!
Updated : Dec 1, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో మోస్ట్ ఫౌల్ గేమ్స్ ఎవరు చేసారంటే.. అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక పేర్లే వినిపిస్తాయి. ఇది నిన్న జరిగిన టాస్క్ లో మరోసారీ బయటపడింది. శోభాశెట్టి గురించి, ఆమె చూపించే ఫేవరిజమ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె సంఛాలక్ గా ఉందంటే చాలు తన స్నేహితుడు అమర్ దీప్ నే గెలిపిస్తుంది. శోభాశెట్టి ఎన్నిసార్లు సంఛాలక్ గా ఫెయిల్ అయిన బిగ్ బాస్ మాత్రం ఆమెనే సంఛాలక్ గా కంటిన్యూ చేస్తున్నారు.
ఫినాలే అస్త్ర కోసం గత నాలుగు రోజుల నుండి హౌస్ లో సాగుతున్న టాస్క్ లలో కంటెస్టెంట్స్ తమ ఆటతో ఒక ఇంటెన్స్ డ్రామాని క్రియేట్ చేస్తున్నారు. ఊహించని ట్విస్ట్‌లు ఊహకందని మలుపులతో బిగ్ బాస్ సీజన్ 7 ‘ఫినాలే అస్త్ర’ టాస్క్ కొనసాగుతోంది. నిన్న మొన్నటి టాస్క్‌లతో స్కోర్ బోర్డ్ పరుగులెత్తుతోంది. టాస్క్ టాస్క్‌కి లెక్కలు మారిపోతున్నాయి. ప్రియాంక, శివాజీ, శోభాలు లీస్ట్ స్కోర్‌తో ‘ఫినాలే అస్త్ర’ రేస్ నుంచి తప్పుకున్నారు. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో.. స్కోర్ బోర్డ్‌లోని ప్లేస్‌లు తారుమారయ్యాయి. క్రికెట్ స్కోర్ టాస్క్ లో అమర్ దీప్ గెలిచాడు. ఇందులో బజర్ మోగిన తర్వాత రింగ్ వేసి ఫౌల్ వేసిన సంఛాలక్ గా ఉన్న శోభా, ప్రియాంక పట్టించుకోలేదు. ఇక ఇసుకని తీసి వాటిలో నుండి అటు వెళ్లి తాళం తీసి మళ్లీ రిటర్న్ వచ్చి బెల్ కొట్టే టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గెలిచి వంద పాయింట్లు సాధించాడు.
ఇక ఈ గేమ్ తర్వాత యావర్ కి తక్కువ పాయింట్లు ఉండటంతో యావర్ తప్పుకొని తన పాయింట్లలో పావు వంతు పాయింట్లని ప్రశాంత్ కి ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఒక చేత్తో బాల్ ని పట్టుకొని ప్లాట్ ఫామ్ కి కాళ్ళు తాకకుండా కూర్చొవాలి. పైన బకెట్ లో వాటర్ ఉంటాయి. ఆ బకెట్, కంటెస్టెంట్స్ కాళ్ళకి తాడుతో కట్టేసి ఉంటుంది. ఇక ఈ గేమ్ లో పల్లవి ప్రశాంత్ గెలిచి వంద పాయింట్లు సాధించాడు. ఇక ఆ తర్వాత టాస్క్ లో.. అమర్, గౌతమ్, అర్జున్, ప్రశాంత్ ల కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి. వారి ముందున్న బాక్స్ లో కొన్నిటిని ఉంచుతారు. వాటిలో ఫాస్ట్ గా గెస్ చేసి చెప్పిన వారికి వంద పాయింట్లు అని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో అమర్ ఫస్ట్, ప్రశాంత్ సెకండ్ స్థానాలలో ఉండగా.. లీస్ట్ లో అర్జున్ ఉన్నాడు. ఇక గేమ్స్ అన్నీ ముగిసాక గౌతమ్ కృష్ణ లీస్ట్ లో ఉన్నాడు. ఇక లెక్క ప్రకారం గౌతమ్ తన పాయింట్లని.. అమర్ , ప్రశాంత్, అర్జున్ లలో ఎవరో ఒకరికి ఇవ్వాలి. అతను ఎవరికిస్తే వారే విన్ అవుతారు. ప్రస్తుతం అమర్ , ప్రశాంత్ ఇద్దరు సరిసమానంగా ఉన్నారు. అర్జున్ వీరిద్దరి కంటే సుమారు వంద పాయింట్ల తక్కువగా ఉన్నాడు. మరి గౌతమ్ తన పాయింట్లని ఎవరికిస్తాడు అనే సస్పెన్స్ తో ఎపిసోడ్ ముగిసింది. మరి ఈ టికెట్ టు ఫినాలే రేస్ లో గెలిచిందెవరో తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే.