English | Telugu

అరియనాకి మెంటల్ స్ట్రెస్... అమరదీప్‌తో హాఫ్ డే!


బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారి గురించి బయట పెద్దయుద్ధమే జరుగుతుంది. హౌజ్ లో ఉన్న వారికంటే వారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాల్లే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. హౌజ్ లో ఉన్న వారికోసం బయట ఉన్నవాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఓటింగ్ ని పెంచేస్తున్నారు. అందులోను రోజురోజుకి తన మాటతీరుతో, ఆటతీరుతో వరెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్న అమర్ దీప్ ని సపోర్ట్ చేస్తూ అరియానా మరో వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

అరియనా తన ఫ్రెండ్ అమర్ దీప్ కోసం ఒక వీడియోని పోస్టు చేసింది. నిన్న జరిగిన నామినేషన్ లో అంబటి అర్జున్ అమర్ దీప్ నీ నామినేట్ చేసాడని, క్లియర్ గా పాయింట్స్ కూడా చెప్పాడని అరియానా అంది. " నాకు ఏమనిపిస్తుందంటే నా ఫ్రెండ్ అమర్ దగ్గరికి వెళ్లి.. అంత బానే ఆడుతున్నావ్ రా ? నువ్వు సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోతున్నావ్ రా, అందుకే నీ గేమ్ కన్పించడం లేదు. అందరూ నా వాళ్ళే అని అనుకొని పెద్ద బొక్క పెట్టుకుంటున్నావని అనిపిస్తుంది. బిగ్ బాస్ కుదిరితే ఒక్క రోజే నన్ను లోపలికి పంపించండి. ఒక్క హాఫ్ డే అయిన పంపించండి. నా ఫ్రెండ్ ని ఆ పరిస్థితులలో చూడలేకపోతున్నాను. వాడు గేమ్ ఆడడం ఏంటో గాని నాకు మెంటల్ స్ట్రెస్ అయిపోతుంది" అని తన బాధని పంచుకుంది అరియాన.

అమర్ దీప్ ని నెగెటివ్ చేయొద్దు. మీ ఫేవరెట్ వాళ్లని ముందుకు తీసుకొని రండి కానీ ఒకరిని నెగటివ్ చేసి ఇంకొకరు సక్సెస్ అవడం తప్పు. అదొక సక్సెస్ ఏనా అని అరియనా ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. అమర్ దీప్, అరియానా బయట ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసిందే. గత వారం గుడ్ డే మూమెంట్ లో అమర్ దీప్ తనకిష్టమైన వాళ్ళు అని అరియానాని చెప్పిన విషయం తెలిసిందే. మరి అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తూ అరియాన పోస్ట్ చేసిన ఈ వీడియోకి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ వారమైన అమర్ దీప్ తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటాడా లేదా చూడాలి మరి!

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.