English | Telugu

కనకం అత్యాశకి దుగ్గిరాల కుటుంబం సెట్ అవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్ -20 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. ఇంట్లో అందరు కనకం చెప్పినట్టే వింటామని మాట ఇవ్వడంతో తన ఆనందానికి అవధులు లేకుండాపోతాయి. మరోవైపు రాజ్ ని కాకుండా రాహుల్ ని ప్రేమిస్తున్నాననే విషయాన్ని కనకంకి చెప్పాలా? వద్దా? అనే సతమతంలో స్వప్న ఉండగా.. కనకం వాళ్ళ అక్కకి కాల్ చేస్తుంది. కనకం వాళ్ళ అక్కకి మిస్డ్ కాల్ ఇవ్వగా.. అక్క మీనాక్షి తిరిగి ఫోన్ చేస్తుంది. ఇక సంతోషంగా ఫీల్ అవుతున్నట్టుగా.. జరిగిన విషయాలన్నీ చెప్తుంది. చివరికి పెళ్లిచూపులు మీనాక్షి ఇంట్లో జరిగేలా కనకం ప్లాన్ చేస్తుంది. ఇక పెళ్లి చూపులకు అయ్యే ఖర్చు గురించి కావ్య ఆలోచిస్తుంటుంది. వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు, మనల్ని కట్నం అడగరు.. కానీ పెళ్లి మాత్రం ఘనంగానే చెయ్యాలి నాన్న అని కృష్ణమూర్తితో కావ్య అంటుంది. "నువ్వు నీ అమ్మ, అక్కల.. గొంతమ్మ కోరికలు తీర్చడానికి చాలా కష్ట పడుతున్నావ్.. మీ ముగ్గురి పెళ్ళిళ్ళకని కొంత డబ్బు డిపాజిట్ చేసాను కదా ఆ డబ్బులతో దాని పెళ్లి చేద్దాం" అని అంటాడు కృష్ణ మూర్తి. అప్పువి దాని చదువుకు ఉపయోగపడుతాయి. నా డబ్బులు, అక్కవి రెండిటితో పెళ్ళి చేద్దామని కావ్య అనగా.. "నా డబ్బులతో వద్దు.. నాకు పెళ్లి అయ్యాక చేతిఖర్చులకు కావాలి" అని స్వప్న చెప్తుంది. అలా స్వప్న చెప్పగానే.. "కావ్య తన డబ్బులు కూడా కలిపి నీ పెళ్లి చేస్తానంటుంది.. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావ్" అని స్వప్నని కోప్పడతాడు కృష్ణమూర్తి.

మరోవైపు రాజ్ చెంపపై కావ్య కొట్టడాన్ని పదే పదే గుర్తుచేసుకుంటూ.. తనపై కోపం పెంచుకుంటాడు. ఇప్పుడు ఆ చేదు అనుభవం ఎందుకు తలుచుకోవడం.. ఇప్పుడు నా జీవితాన్ని షేర్ చేసుకొనే స్వప్న దగ్గరికి వెళ్తున్నాను కదా అని అనుకుంటూ రాజ్ సిగ్గుపడతాడు. పెళ్లి చూపులకు మంచి రోజు ఉందో లేదో పంతులిని రాజ్ వాళ్ళ అమ్మ ఇంకా కుటుంబసభ్యులు అడిగి తెలుసుకుంటారు. అందరూ కలిసి వెళదామని అనుకుంటారు. "నువ్వు ఆల్రెడీ అమ్మాయిని చూసావ్ కదా రాజ్.. అమ్మ వాళ్ళు వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకుంటారు. నీకు ఈ రోజు సెలబ్రిటీ యాడ్ గురించి ప్రోగ్రామ్ ఉంది కదా" అని రాజ్ వాళ్ళ నాన్న చెప్తాడు. అలా చెప్పడంతో రాజ్ నిరాశపడతాడు. రాహుల్ కన్నింగ్ గా అలోచించి.. "ఆ వర్క్ నేను చూసుకుంటాను.. నువ్వు హాయిగా పెళ్లి చూపులకు వెళ్ళు" అని చెప్తాడు.

దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు. ఎలా రెడీ కావాలంటూ కనకం హడావిడి చేస్తుంది. ఇక అన్నీ వాళ్ళ రేంజ్ లో ఆర్డర్ చెయ్యాలని స్వప్న ఆర్డర్ చేస్తుంది. ఆ తర్వాత కనకం, స్వప్నలు అందంగా ముస్తాబై.. మీనాక్షి ఇంటికి బయల్దేరుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.