English | Telugu

రాజ్ ఫ్యామిలీకి అసలు నిజం‌ తెలిసినట్టేనా?

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-47 లో కనకం చేసిన మోసానికి పోలీస్ కంప్లెంట్ ఇవ్వాలని రాజ్ ఫోన్ చేస్తుండగా.. "చెయ్ తప్పు ఎవరిదో తెలుస్తుంది. మంచితనం ముసుగులో ఉండి, నాకు ముసుగు కప్పి పెళ్ళి చేసి ఇప్పుడు మంచిగా నటిస్తున్న ఆ మనిషి గురించి నేను చెప్తాను" అని కావ్య అంటుంది. దాంతో ఇంట్లో షాక్ అవుతారు.

మరో వైపు స్వప్న, రాహుల్ కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. దీంతో తన గురించి నిజం తెలిసిపోయిందేమోనని స్వప్న టెన్షన్ పడుతుంది. అంతలోనే రాహుల్ వస్తాడు. పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని స్వప్న అంటుంది. "ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అని చిరాకు తెప్పిస్తున్నవ్.. నాకు అసలే ఆఫీస్ టెన్షన్ ఉంది" అని కోప్పడతాడు రాహుల్. "నన్ను ఇంత మోసం చేసావ్ నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా" అని మనసులో అనుకుంటాడు రాహుల్. ఇక తర్వాత కూల్ గా స్వప్నతో మాట్లాడతాడు.

మరోవైపు ఏంటి ఇందాక ఏమో అన్నావ్ గా? దీని అంతటికి కారణం ఇంకొకరు అన్నావ్ కదా? ఎవరువాళ్ళు అని అపర్ణ అడుగుతుంది. మా అక్క వెళ్ళిపోయాక, మీకేం సమాధానం చెప్పాలో తెలియక మా అమ్మ ఉరేసుకోబోతుంటే, నేను చూసి ఆపాను. మేము మా అక్క గురించి మాట్లాడుకుంటుంటే, ఈ రుద్రాణి వచ్చి మా అక్క స్థానం లో నన్ను కూర్చోపెట్టమందని కావ్య అందరికి జరిగిన నిజం చెప్తుంది. రాజ్ మాత్రం మా ఇంట్లో వాళ్లపై నిందలు వేస్తావా అనేసరికి.. పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి.. "అవును రాజ్ తను చెప్పింది కరెక్టే.. ఆ రోజు స్వప్నని తీసుకొస్తా అని నేను వెళ్తుంటే నన్ను ఆపి తను వెళ్ళింది.. అంటే అప్పటికే స్వప్న వెళ్ళిపోయింది. తనే కావ్యని ముసుగులో తీసుకొచ్చింది" అని అంటుంది. ఇదంతా చేసింది నువ్వా అని రుద్రాణిని అపర్ణ అడుగుతుంది. "అవును నేనే చేశాను.. మన కుటుంబం పరువు కాపాడడానికి అలా చేశాను" అని రుద్రాణి అంటుంది. నేను వెళ్ళొస్తానని కావ్యకి కనకం చెప్పి వెళ్తుంటే.. ఇంకెప్పుడు రావద్దని కావ్య అంటుంది.

ఆ తర్వాత ఎమోషనల్ అయి కనకం వెళ్ళిపోతుంటే.. ఆగమ్మా అని వెళ్ళి హాగ్ చేసుకొని.. ఇక్కడ జరిగిందంతా ఇక్కడే మర్చిపో అమ్మా.. నాన్న, అప్పు వాళ్ళకు చెప్పకు అని కావ్య అంటుంది. సరే అని కనకం వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.