English | Telugu

పంతంతో వసుధారని వదిలేసి వెళ్ళిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ‌'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-714 లో.. "రిషి సర్ నన్ను ఏమన్నా కూడా నేను బాధపడుతాను కావొచ్చు..‌ కానీ నా వల్ల రిషి సర్ బాధపడుతున్నారని తలుచుకుంటేనే నాకు బాధేస్తుంది" అని జగతితో వసుధార అంటుంది. "అర్థం చేసుకోవాలే కానీ రిషి మనసు బంగారు కొండ. ఇప్పుడు మంచుకొండలా గడ్డకట్టినట్టు ఉంది. దానిని నువ్వే నీ ప్రేమతో కరిగించుకోవాలి" అని జగతి చెప్తుంది. "రిషి సర్ బాధే నన్ను ఎక్కువ బాధిస్తుంది. నాకొచ్చిన కష్టం కంటే రిషి సర్ కష్టపడుతుంటేనే నేను భరించలేకపోతున్నాను. మా మధ్య దూరం తగ్గించాడనికి ఎంత దూరమైనా వెళ్తాను మేడం" అని జగతితో చెప్తుంది వసుధార.

ఆ తర్వాత రిషి కాలేజీకి బయల్దేరి ఇంటి ముందున్న కార్ దగ్గరికి వస్తాడు. అప్పుడే వసుధార ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకొని కార్ దగ్గరికి వస్తుంది. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు మనసులో మాట్లాడుకుంటారు. వసుధార లిఫ్ట్ అడిగితే ఇస్తా అని రిషి పట్టుదలతో ఉండగా, తను పిలవకుండా నేను వెళ్ళనని వసుధార పంతంతో ఉంటుంది. ఇక కాసేపు చూసి వసుధారతో ఏమీ మాట్లాడకుండా రిషి ఒక్కడే కార్ లో బయల్దేరి వెళ్తాడు. రిషి కార్ లో వెళ్తూ.. నువ్వు నా పక్కనుంటే బాగుంటుంది వసుధార అని తన గురించే ఆలోచిస్తుంటాడు.

ఆ తర్వాత వెనకాల నుండి హారన్స్ వినిపిస్తాయి.‌ కార్ సైడ్ ఇస్తాడు రిషి. స్కూటీ మీద వసుధార, మరో బైక్ మీద మహేంద్ర, జగతి.. కార్ ని దాటేసి ముందుకి వస్తారు. అది చూసి రిషి.. వీళ్ళేంటి ఇలా నన్ను వెళ్ళనీయకుండా వస్తున్నారని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత వసుధార కాలేజీకి వెళ్ళిపోతుంది. కాసేపటికి రిషి కూడా కాలేజీకి వచ్చి తన క్యాబిన్ లో కూర్చుంటాడు. ప్యూన్ ని పిలిచి.. వసుధారని రమ్మని చెప్తాడు. అతను వెళ్ళి వసుధారకి చెప్పగా.. తనని ఏదైనా అంటాడేమో అని ఆలోచిస్తుంది. తర్వాత రిషికి కాల్ చేసి నేను బిజీగా ఉన్నాను రాలేనని చెప్పగా.. మరి నేను రావాలా అని రిషి అంటాడు. వద్దులేండి సర్ నేనే వస్తానని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.