English | Telugu

గుడిలో కావ్యని ఎత్తుకొని ప్రదక్షిణలు చేసిన రాజ్.. సంతోషంలో కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -60 లో.. దుగ్గిరాల ఫ్యామిలీ కొత్తగా పెళ్లి అయిన కావ్య, రాజ్ జంటను గుడికి తీసుకొస్తారు. రాజ్, కావ్య ఇద్దరూ కలిసి ప్రదక్షిణలు చేస్తుండగా.. కావ్య కాలు బెణకడంతో తను నడవలేకపోతుంది. ప్రదక్షిణలు మధ్యలో అపవద్దని పంతులు చెప్పినా రాజ్ వినడు. దీంతో రాజ్ వాళ్ళ తాతయ్య సీతారామయ్య కావ్యని ఎత్తుకొని ప్రదక్షిణలు చేయమని రాజ్ కి చెప్తాడు. కావ్య మొదట్లో వద్దు నేను నడుస్తానని చెప్పినా.. ఆ తర్వాత కావాలని పంతంతో.. నడవలేక పోతున్నాను అని కావ్య అనడంతో.. కావ్యని ఎత్తుకొని రాజ్ ప్రదక్షిణలు చేస్తాడు.

రాజ్, కావ్య లను చూసి మారువేషంలో ఉన్న స్పప్న అసూయపడుతుంది. ఇక అక్కడే చాటునుండి చూస్తున్న కనకం, మీనాక్షి ఇద్దరు సంతోషపడతారు. మరోవైపు అపర్ణ చిరాకుగా చూస్తుంది. ఆ తర్వాత పంతులు గారు ప్రసాదం తీసుకోమని చెప్పి ఈ ప్రసాదం ఒకరికొకరు తినిపించుకోవాలని చెప్తాడు. రాజ్ కావ్యకి, కావ్య రాజ్ కి ప్రసాదం తినిపిస్తుండగా.. మధ్యలోకి బోనంతో స్వప్న పరుగున వెళ్తూ.. ఆ ప్రసాదాన్ని కావాలని నెట్టివేస్తుంది. కానీ కిందపడిపోకుండా రాజ్ పట్టుకుంటాడు. అది చూసి మీ బంధాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు ప్రయత్నస్తున్నారని రాజ్ నానమ్మ అంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు ప్రసాదం తినిపించుకుంటారు. ఇదంతా దూరం నుంచి చూసి మురిసిపోతుంటుంది కనకం. అలా చూస్తున్నప్పుడు అనుకోకుండా కనకంని దుగ్గిరాల ఫ్యామిలీ చూస్తారు. అపర్ణ కోపంగా కనకంని తక్కువ చేసి మాట్లాడుతూ.. మీరు ఇంకోసారి కలవాలని ప్రయత్నిస్తే.. మీ కూతురు మీ ఇంటికి వస్తుందని వార్నింగ్ ఇస్తుంది. మా అమ్మ అనుకోకుండా ఈ గుడికి వచ్చింది. తన తప్పేం లేదని కావ్య అంటుంది.

మరోవైపు స్వప్న దగ్గరికి రాహుల్ వస్తాడు. మీరు చెప్తే నమ్మలేదు కానీ ఈ రోజు చుస్తే కావ్య గురించి అర్థం అయిందని స్వప్న అంటుంది. మరో వైపు రాజ్ కి పోలీస్ స్టేషన్ నుండి SI ఫోన్ చేస్తాడు. మీ భార్య.. వాళ్ళ అక్క కన్పించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. తన గురించి వెతుకుతున్నాం.. అదే విషయం చెప్పాడానికి తనకి కాల్ చేస్తే కాల్ కలవటం లేదు. మీరు మీ భార్యకి చెప్పండని కాల్ కట్ చేస్తాడు SI. రాజ్ కోపంగా కావ్య దగ్గరికి వెళ్తూ రూమ్ ముందే ఆగిపోతాడు. లోపలికి వెళ్లొద్దని ఆలోచించి, రేపు మాట్లాడుతానని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.