English | Telugu

అపర్ణ వెళ్ళకుండా ఆపిన రాజ్ వాళ్ళ నాన్న.. స్వప్న దొరికేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -67 లో.. నా ఇంట్లోనే నాకు అవమానం జరిగిందని రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ వెళ్ళిపోతుండగా.. రాజ్ వాళ్ళ నానమ్మ ఎందుకని అడుగుతుంది. నా కొడుకిని నా నుండి దూరం చేస్తున్నారని అపర్ణ అనగా.‌ వాడు ఒప్పుకుంటేనే జరిగిందని రాజ్ వాళ్ళ నాన్న అన్నాడు. అందరం కలిసి మా అభిప్రాయాలను రుద్దలేదని రాజ్ తాతయ్య అంటాడు. రాజ్ మనసు కరిగి భార్య మాట వింటుంటే ఏంటక్కా ఈ అలక అని ... అలక కాదు ధాన్య లక్ష్మి..వీళ్ళందరూ నాదే తప్పు అంటున్నారు. అసలు వ వాడి అభిప్రాయలకు విలువే లేదా.. వాడి గురించి నాకు‌ దిగులే ఉండదా.. ఇక్కడ ఏం మిగిలింది నాకు‌.. శూన్యం.‌ కోడలిగా, భార్యగా అనగదొక్కారు నేను ఈ శూన్యంలో ఉండలేనని అపర్ణ వెళ్ళిపోతుండగా.. అందరూ రిక్వెస్ట్ చేస్తారు.‌ అయినా వినిపించుకోకుండా వెళ్తుంటుంది.. ఒక్క నిమిషం అపర్ణ.. అత్తింటి గడప దాటే ముందు దుగ్గిరాల వంశానికి తీరన మచ్చ.. మళ్ళీ ఈ గడపలో అడుగుపెట్టవ్ అని రాజ్ నాన్న అనగా.. నన్ను గడప దాటకుండా ఈ వంశ గౌరవం ఆపిందని చెప్పి అపర్ణ ఇంటిలోపలికి వెళ్తుంది.

మరోవైపు కావ్య వాళ్ళింటికి వెళ్ళిన రాజ్ ఇళ్ళంతా స్వప్న కోసం గాలిస్తుంటాడు. ఎక్కడ చూసిన స్వప్న కనపడదు. కాసేపటికే బయట నుండి డోర్ కొడుతున్న చప్పుడు వినిపించడంతో.. అది స్వప్నే అని అనుకొని రాజ్ డోర్ తీయగా.. కావ్య వాళ్ళ అన్న చేపలు తీసుకొని వస్తాడు.. రాజ్ ని బావ సూపర్ ఉన్నావ్.. సెల్ఫీ దిగుదామంటూ ఇబ్బంది పెడతాడు. కాసేపటికే కావ్య వాల్ల అమ్మ కనకం వచ్చి బావని ఇబ్బంది పెట్టకని చెప్పి అతడిని పంపించేస్తుంది. మరోవైపు స్వప్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి స్వప్న వెళ్తుంది.

తర్వాత గదిలోకి వెళ్ళిన రాజ్ ని చూసి మీరు వెతుకుతున్న మా అక్క కనపడిందా అని కావ్య అడుగుతుంది. నీకెలా తెలుసని రాజ్ అడగగా.. మీరు నన్ను మా ఇంటికి తీసుకొస్తానని చెప్పినప్పుడు మీ ఇంట్లో వాళ్ళే నమ్నలేదు.. నేనెలా నమ్ముతానని కావ్య అంటుంది. అపార్థం మీ అణువణువునా ‌నిండి ఉంది. ఇక నేను ఇక్కడ ఉండను . నేను మా ఇంటికి వెళ్తానని రాజ్ వెళ్తుండగా.. భోజనం చేసాక ఇద్దరం వెళదామని కావ్య రిక్వెస్ట్ చేసినా వినిపించుకోకుండా వెళ్తండగా.. కనకం వాళ్ళ అక్క వస్తుంది. అల్లుడు గారు మీరు వచ్చారని మా చెల్లి చెప్తే నమ్మలేకపోయానని అంటుంది కనకం వాళ్ళ అక్క. ఎంత గొప్ప మనసు బాబు.. ‌బాబు.. ఆగండి బాబు..మీకేం కావాలో చెప్పండి అంటూ కామెడీ చేస్తుంది కనకం వాళ్ళ అక్క. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.