English | Telugu
ఏంజిల్ ప్రేమని రిజెక్ట్ చేసిన రిషి!
Updated : Aug 28, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -853 లో.. ఏంజిల్ అందంగా రెడీ అయి రిషి కోసం ఎదురు చూస్తుంటుంది. అంతలోనే రిషి వస్తాడు. రిషి నీతో మాట్లాడాలి నీకోక సర్ ప్రైజ్ అని ఏంజిల్ చెప్తుంది. రిషి చెయ్యి పట్టుకొని మేడపైకి తీసుకొని వెళ్తుంది ఏంజిల్.
మరొక వైపు ఏంజిల్ కి క్యాండీలైట్ డిన్నర్ ఐడియా ఇస్తుంది వసుధార. దాంతో వసుధార టెన్షన్ పడుతు ఉంటుంది. ఐడియా అయితే ఇచ్చాను. అసలేం జరిగి ఉంటుంది.. రిషి సర్ ఏంజిల్ తో డిన్నర్ కి వెళ్లాడా అని ఏంజిల్ కి ఫోన్ చేస్తుంది వసుధార. ఏంజిల్ ఫోన్ ఇంట్లో పనిమనిషి లిఫ్ట్ చేసి ఏంజిల్ రిషిని పైకి తీసుకొని వెళ్ళిందని చెప్పగానే వసుధార నిరాశ చెందుతుంది. మరొక వైపు రిషి వెళ్లి చూసేసరికి క్యాండీలైట్ డిన్నర్ కి అంత రెడీ చేస్తుంది ఏంజిల్. ఏంటి ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నావ్? నాకు ఇలాంటివి నచ్చావ్. ఇలాంటి ప్రయత్నం చెయ్యకని చెప్పాను కదా అని ఏంజిల్ పై రిషి అరుస్తాడు. ఏంటి రిషి అలా అంటావ్.. నీకోసం కష్టపడి ఇలా చేస్తే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని ఏంజిల్ అంటుంది. నీ హద్దుల్లో నువ్వు ఉండమని ఏంజిల్ ని రిషి అంటాడు. హద్దుల గురించి మాట్లాడుతున్నావ్ నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని ఏంజిల్ అడుగుతుంది. నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం. నీకు ఇంతకు మించి కోపంగా చెప్పలేను. నువ్వు నా ఫ్రెండ్ వి అని రిషి చెప్పేసి వెళ్ళిపోతాడు. రిషి మాటలు తల్చుకొని ఏంజిల్ బాధపడుతుంది. ఆ తర్వాత క్యాండీలైట్ డిన్నర్ ఐడియా ఇచ్చిన వసుధారని రిషి కలిసి తన కోపాన్ని మొత్తం చూపిస్తాడు. ఎందుకిలా చేస్తున్నావని వసుధారతో రిషి అంటాడు. క్యాండీలైట్ డిన్నర్ చేసి వచ్చారా అని వెటకారంగా వసుధార అనగానే.. నేను ఎందుకు చేస్తాను. అక్కడ నువ్వు లేవు కదా అని రిషి అనగానే.. నేను ఉంటే చేస్తారా అని వసుధార సంతోషపడుతుంది. ఇకనైనా ఏంజిల్ కి అలా ఐడియాలు ఇవ్వడం మానేయ్యండని వసుధారకి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు రిషి.
మరొక వైపు వసుధార దగ్గరికి ఏంజిల్ వచ్చి.. క్యాండీలైట్ డిన్నర్ ప్లాన్ ని రిషి అప్సెట్ చేసాడని చెప్తుంది. మరొక ప్లాన్ చేసి రిషి మనసులో ఏం ఉందో తెలుసుకుంటానని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత వసుధార కాలేజీకి వెళ్తుంది. అప్పుడు వసుధారకి మహేంద్ర ఫోన్ చేసి.. రిషి గురించి తెలుసుకుంటాడు. అప్పుడే రిషి వచ్చి ఫోన్ తీసుకొని ఎవరితో మాట్లాడుతూన్నారని అడుగుతాడు. మహేంద్ర సర్ తో అని వసుధార చెప్పగానే.. ఇక్కడ విషయాలు అన్ని చెప్పకండని వసుధారకి రిషి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.