English | Telugu

'అరుంధతి' స్పూఫ్‌తో అదరగొట్టిన లాస్య, రవి!

బుల్లితెర మీద రవి, లాస్యల కాంబినేషన్ అప్పట్లో పెద్ద హిట్. ఉదయం పాటల ప్రోగ్రాంతో పలకరించే ఈ జంట మరికొన్ని టీవీ షోలలో కూడా సందడి చేసేది. ఆ తరువాత వాళ్ల క్రేజ్ తగ్గింది. పైగా ఇద్దరికీ గొడవలు వచ్చి విడిపోయారు. అలా దాదాపు ఐదేళ్లుగా వీరు విడిగానే ఉన్నారు. ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే ఈ మధ్య మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు.

అంతేకాదు, ప్రస్తుతం ఇద్దరూ కలిసి 'కామెడీ స్టార్స్' షోలో సందడి చేస్తున్నారు. రవితో కలిసి ఒకప్పటి మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది లాస్య. 'కామెడీ స్టార్స్' షోలో టాలీవుడ్ హిట్ సినిమాలను స్పూఫ్ లుగా చేస్తూ కామెడీ పండిస్తున్నారు. గతంలో 'ఉప్పెన', 'నరసింహ', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా' వంటి సినిమాలను స్పూఫ్ చేసి కామెడీ పండించారు.

తాజాగా 'అరుంధతి' సినిమాను స్పూఫ్ చేశారు. అరుంధతిగా లాస్య‌.. పశుపతిగా ర‌వి వేషాలు వేశారు. రవి స్టేజ్ పైకి రాగానే 'లాస్య ఆంటీ అయిందే' అంటూ పంచ్ వేసేశాడు. ఆ తరువాత లాస్య నవ్వుని చూసుకుంటూ 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే' పాట వేసుకున్నాడు రవి. ఐదేళ్లుగా నీకో విషయం చెబుదామనుకుంటున్నా అంటూ రవిపై సమాధి వేసి మూసేస్తూ 'స్టే హోమ్ స్టే సేఫ్' అంటూ మెసేజ్ ఇచ్చింది లాస్య. ఆ త‌ర్వాత స‌మాధిలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, "ఐదేళ్లు సమాధిలో కుళ్ల‌బెట్టిన నిన్ను ఈ రోజు వ‌ద‌ల బొమ్మాళీ".. అంటూ హ‌ల్‌చ‌ల్ చేశాడు ర‌వి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...