English | Telugu

శ్రేయ, ఆర్తి అగర్వాల్ కి మా అమ్మ హెయిర్ డ్రస్సేర్!

యాంకర్ విష్ణుప్రియ, మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి నటించిన "జరీ జరీ పంచెకట్టు" అనే ఫోక్ సాంగ్‏కు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ సాంగ్ రిలీజ్ ఐన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఫోక్ సాంగ్ తో వ్వావ్ అనిపించుకున్నారు. అదే "గంగులు" ఫోక్ సాంగ్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఐతే ఈ సాంగ్ కూడా బాగా క్లిక్ అయ్యేసరికి వీళ్ళు దావత్ చేసుకున్నారు. "మై విలేజ్ షో" అనిల్, అంజి మామ, మానస్, విష్ణుప్రియ..వీళ్లంతా కలిసి ఫార్మ్ హౌస్ లో బొందలో చికెన్ ని వండారు. తాను నటించిన రెండు ఫోక్ సాంగ్స్ ని విష్ణుప్రియతో పాడించారు. "జరీ జరీ పంచె కట్టు" అంటే ఏమిటి అని అంజి మామ అడిగేసరికి దానికి పెద్ద క్లాస్ చెప్పింది విష్ణు. ఇక అంజి మామకి పెద్ద డౌట్ వచ్చింది. "విష్ణు ప్రియా అంటే రెండు పేర్లా అని అడిగేసరికి..అవును రెండు.. అర్ధనారీశ్వరులు, శివపార్వతులు రెండు. అంటే నాలోనే ఒక భాగం విష్ణువు మరో భాగం ప్రియా అని చెప్పింది. "విష్ణువు అంటే మేల్..ప్రియా అనే ఫిమేల్" అని చెప్పింది. "నాలో అబ్బాయిలా పొడిచి చంపేసే శక్తి ఉంది..అమ్మాయిలా ప్రేమించి..మంచిని పంచే గుణాలు కూడా ఉన్నాయి" అని చెప్పింది. ఇక విష్ణుప్రియ బొందలో చికెన్ వండడం కోసం వెజిటబుల్స్ ని కట్ చేస్తూ తన గురించి చెప్పుకొచ్చింది.

"మా ఊరు చీరాల...నేను పుట్టింది చెన్నై...నేను ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చేసాను. 2015 లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. 2018 లో పోవే పోరా షోతో నాకు బ్రేక్ వచ్చింది. చెప్పాలి అంటే మా అమ్మ హెయిర్ డ్రెస్సర్...చిన్నప్పుడు శ్రేయ, ఆర్తి అగర్వాల్ కి పని చేసేవాళ్ళు. మా అమ్మ చాలా టాలెంటెడ్...ఆమె భరతనాట్యం డాన్సర్ కూడా. ఇంత టాలెంట్ ఉన్న మా అమ్మ హెయిర్ డ్రెస్సెర్ గా మిగిలిపోవడం నచ్చక నేను ప్రూవ్ చేసుకుని మా అమ్మ పేరు నిలబెట్టడం కోసం నేను ఇంత వరకు వచ్చాను. చెప్పాలంటే నేను చాలా బద్దకస్తురాలిని...మా అమ్మ దృష్టిలో నేను పెద్దగా ఏమీ చేయలేదు అని కానీ నా దృష్టిలో మాత్రం నేను ఇంతవరకు వచ్చాను అంటే చాలా గ్రేట్" అని తన గురించి తాను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.