English | Telugu

నేను అలాంటి తప్పులు చేయలేదు!

టాలీవుడ్‌లో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. కొన్ని చిత్రాల్లో కూడా నటించింది. ఈమె అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లు కూడా చేస్తుంటుంది. తెలుగమ్మాయి కావడంతో తమ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే శ్యామలను యాంకర్ సుమతో పోలుస్తూ సుమ తరువాత మీరే అని చాలా మంది ఫ్యాన్స్ అనడంతో తెగ పొంగిపోతోంది శ్యామల. సుమతో పోలుస్తూ తనను పొగుడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంటుందని చెప్పుకొచ్చింది.

చాలా మంది తమ ఇంట్లో అమ్మాయిలా ఉందని, పద్ధతులు పాటిస్తోందని.. మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నా.. కానీ పద్దతిగానే ఉంటుందని అందరూ చెబుతుంటారని.. మహిళలు తనకు బాగా కనెక్ట్ అవుతుంటారని శ్యామల చెప్పుకొచ్చింది. ఈవెంట్ కోసం బయటకి వెళ్లినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారని వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో యాంకరింగ్ చేస్తూనే.. సీరియ‌ల్స్‌లో నటించేదాన్ని అని చెప్పిన శ్యామల.. తన భర్త ప్రోత్సాహంతో యాంకరింగ్ మీద దృష్టి పెట్టినట్లు.. అలా తన భర్త స్నేహితుడి ద్వారా 'మా ఊరి వంట' ప్రోగ్రాంలో ఛాన్స్ వచ్చిందని తెలిపింది.

ఇక తన మీద ఇప్పటివరకు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ రాలేదని.. ఎందుకంటే తను వాటికి అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. తన జర్నీ చాలా స్మూత్ గా సాగిపోతోందని తెలిపింది. కొంతమంది ఫాస్ట్ రిజల్ట్ కోసం పరుగులు పెడతారని.. ఈ క్రమంలో కొన్ని తప్పులు చేస్తుంటారని.. తను మాత్రం అలాంటి తప్పులు చేయలేదని.. అందుకే బ్యాడ్ కామెంట్స్ రాలేదని చెప్పుకొచ్చింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.