English | Telugu
30 ఇయర్స్ ఇండస్ట్రీలో నేను తెలియని వాళ్ళు కూడా ఉన్నారా ?
Updated : Aug 27, 2022
సుమ ఈ పేరుకు ముందు వెనక ఏ తోక తగిలించిపోయినా యాంకర్ సుమ అని ఇట్టే గుర్తుపట్టేస్తారెవరైనా. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమ అంటే తెలియనవారు గుర్తు పట్టని వారెవ్వరూ ఉండరు. కానీ అలాంటి సుమకే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఎదురయ్యింది. వినాయక చవితి రాబోతున్న సందర్భంగా షాపింగ్ చేయాలని డిసైడ్ అయ్యి సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లి కనిపించిన వాళ్లందరికీ షాక్ హ్యాండ్ ఇచ్చి పలకరించింది.
తర్వాత ఆమె ఒక ఫేమస్ స్వీట్ షాపుకు వెళ్లింది. అక్కడ పని చేసే వాళ్లంతా హిందీ వాళ్ళు కాబట్టి ఆమెను ఎవరూ గుర్తు పట్టలేదు. అంతే సుమ ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది. "30 ఏళ్ళు ఇండస్ట్రీలో చేస్తే ఈరోజు వీళ్లకు నేనెవరో తెలీదు అందరూ తెల్లమొహాలేసుకుని నిలబడ్డారంటూ" బాధపడింది.
సుమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త కొత్త పెయిడ్ ప్రొమోషన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇటీవల ఆమె ఒక స్వీట్ షాప్ కి వెళ్లి ప్రమోట్ చేసింది. షాపులో అన్ని రకాల స్వీట్స్ తిని టేస్ట్ చూసి నిజాయితీకి మారుపేరు ఈ స్వీట్స్ అంటూ పబ్లిసిటీ చేసింది. అక్కడి వాళ్ళెవరూ గుర్తుపట్టకపోయేసరికి హిందీ నేర్చుకుని మరీ వీళ్ళతో నేను మాట్లాడతాను అంటూ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో అక్కడి వాళ్ళను కాస్త ఎంటర్టైన్ చేసింది.