English | Telugu

అతని మూడో గర్ల్ ఎవరో తెలుసా...సీక్రెట్ బయట పెట్టిన శ్రీముఖి

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో మొదలైన బీబీ జోడి డాన్స్ రియాలిటీ షో బుల్లితెర మీద ఒక రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. రాబోయే వారం ఎపిసోడ్ ప్రాపర్టీ రౌండ్. ఇందులో ఇచ్చిన ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకుని జోడీస్ డాన్స్ చేశారు.

ఇక ఇందులో ఆర్జే చైతూ-ఆర్జే కాజల్ జోడి స్కూల్ యూనిఫార్మ్ లో వచ్చి క్లాస్ రూమ్, బెంచెస్ ని యూజ్ చేసుకుని డాన్స్ చేశారు. విక్రమార్కుడు మూవీలో జింతాత సాంగ్ కి డాన్స్ చేశారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసిన జడ్జి రాధ "క్యూట్..స్మార్ట్..దుమ్ము బాబోయ్..దుమ్ము" అని కంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత శ్రీముఖి వీళ్లకు ఒక టాస్క్ ఇచ్చింది. చైతూకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో రాయమని అడిగేసరికి చైతు ఇద్దరు అని, కాజల్ ముగ్గురు అని రాశారు.

ఇదేంటని శ్రీముఖి అడిగేసరికి "ఆ మూడో వ్యక్తి నాతో నాలుగు నెలల నుంచి మాట్లాడ్డం లేదు " అని అన్నాడు చైతు. "అసలు నిజం చెప్పమంటావా" అని కాజల్ అనేసరికి "వద్దులే...ఎందుకు.." అని శ్రీముఖి ఆ సీక్రెట్ ని చెప్పనివ్వకుండా ఆపేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో వస్తున్న ఈ షో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారం అవుతోంది. మరి ఆ సీక్రెట్ ఏమిటి అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి..

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.