Read more!

English | Telugu

పెళ్ళికి ముందు నో బాల్సే అన్న సౌమ్య... అంత ఛండాలంగా ఉన్నావ్ అన్న నరేష్

జబర్దస్త్ షోలో కామెడీ ఏమో కానీ ఖతర్నాక్ డైలాగ్స్ కి ఏం తక్కువ లేదు. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో నూకరాజు, ఆసియా స్కిట్ లో ఈ టైపు కామెంట్స్ వినిపించాయి. ఈ షోకి "అన్నపూర్ణ ఫోటో స్టూడియో" మూవీ టీం ప్రమోషన్స్ కోసం వచ్చారు. ఆసియా తలుపు చాటు నిలబడి "ఏవండీ చల్ల గాలి వస్తోంది లోపలి రండి" అని నూకరాజుని పిలిచేసరికి "ఇప్పుడు నేను చల్ల గాలి కోసం వస్తే నువ్వు వెచ్చదనం అడుగుతావ్ ఆ తర్వాత నేను చల్లబడి బయటకు రావాల్సి వస్తుంది" అనే డైలాగ్స్ వేసేసరికి అందరూ పగలబడి నవ్వేశారు. "కొత్తగా పెళ్లనేది ఐపిఎల్ మ్యాచ్ లాంటిది కొడితే సిక్స్ కొడితే సిక్స్...వన్ ఇయర్ తర్వాత పెళ్లంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది ఎప్పుడో ఒక సిక్స్" అని పెళ్లి గురించి పెద్ద లెక్చర్ ఇచ్చాడు నూకరాజు.. ఇక ఈ డైలాగ్స్ విన్న హోస్ట్ సౌమ్య ఇంకా ఘాటు కౌంటర్ ఇచ్చింది.."నీకు పెళ్ళికి ముందు అన్ని నో బాల్సే" అనేసరికి కృష్ణ భగవాన్, ఇంద్రజ పడీ పడీ నవ్వారు. నూకరాజు ముఖం బ్లాక్ ఐపోయింది.

రాకెట్ రాఘవా స్కిట్ కూడా ఫుల్ ఫన్నీగా సాగింది.  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనుకుంటున్నారు కదా కాదు జబర్దస్త్ వాకిట్లో జామకాయ చెట్టు అంటూ పంచ్ పేల్చాడు. నూకరాజు, ఆదిలక్ష్మి, నాటి నరేష్ స్కిట్ వేశారు. నటీ నరేష్ ఒక పండును చూపించేసరికి ఆ పండు మత్తెక్కించేది అని ఆ పండు ఒక్కసారి తింటే అందంగా ఉన్నవాళ్లు అందంగా లేనట్టు..అందంగా లేని వాళ్ళు అందంగా ఉన్నట్టు కనిపిస్తారని చెప్పాడు ఆది లక్ష్మి. ఇక నాటి నరేష్ ఆ పండును చేతిలో పట్టుకు "హే సౌమ్య ఏమిటి అంత ఛండాలంగా ఉన్నావ్" అని అడిగాడు. "ఇంద్రజ గారు" అని ఆమె మీద కౌంటర్ వేయబోయాడు నరేష్.."దమ్ముంటే అను" అని నూకరాజు అనేసరికి సైలెంట్ ఐపోయాడు. ఇలా ఈ వారం ప్రతీ స్కిట్ కూడా నవ్వించడానికి ఆడియన్స్ ముందు రాబోతోంది.