Read more!

English | Telugu

తన ఫ్యామిలీని ఆదుకోవాలని చూస్తున్న కావ్య.. పట్టింపులేని స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -148  లో... కనకం కావ్యతో ఫోన్ మాట్లాడుతుండగా.. సేటు వాళ్ళింటికి వచ్చి అప్పు చెల్లించమని అవమానిస్తుంటే కావ్య ఫోన్ లో  వింటుంది. నా కుటుంబం ఇంత బాధల్లో ఉందా? ఎలాగైనా నా ఫ్యామిలీ కి ఫైనాన్సియల్ సపోర్ట్ చెయ్యాలని కావ్య అనుకుంటుంది.

ఆ తర్వాత స్వప్న గదిలోకి కావ్య వెళ్తుంది. నువ్వు ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావ్. అక్కడ అమ్మ నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ అనుకొని, నీకు చీర సారే తీసుకు రావాలని ఆశపడుతుందని కావ్య అంటుంది. వాళ్ళు తెచ్చే చీప్ చీర నాకు అవసరం లేదని స్వప్న అనగానే స్వప్నపై కావ్య కోప్పడుతుంది. చిన్నప్పటి నుండి అమ్మ నీ గొంతమ్మ కోరికలు తీర్చడానికి ఎంత కష్టపడ్డది.. నువ్వు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే నేను ఒప్పుకోనని కావ్య అంటుంది. నా గురించి నేను చూసుకుంటా నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకని స్వప్న అంటుంది. మరొకవైపు కనకం కుటుంబానికి కళ్యాణ్ సరుకులు, కూరగాయలు తీసుకొని వస్తాడు. వాటిని చూసిన అప్పు మేం తినడానికి తిండి లేని వాళ్ళలాగా కనిపిస్తున్నామా? ఇవి తీసుకొని వచ్చి నువ్వు మమ్మల్ని అవమానించావని కళ్యాణ్ పై కోప్పడుతుంది. నేనేం పరాయి వాన్ని కాదు కదా అని కళ్యాణ్ అంటాడు.

చుట్టానివి చుట్టం లాగా ఉండమని కళ్యాణ్ ని అప్పు తిట్టి పంపిస్తుంది. అది విన్న కనకం.. "ఆ అబ్బాయి ఏదో సాయం చేస్తానని వస్తే.. అలా గాయం చేసి పంపిస్తావా అని  అంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే కానీ చెప్పిన విధానం కరెక్ట్ కాదు అని కృష్ణమూర్తి అప్పుతో  అంటాడు. మరొకవైపు రాజ్ దగ్గరికి పనిమనిషి వచ్చి.. కొంచెం డబ్బు కావాలని అడుగుతుంది. కావ్యని రాజ్ పిలిచి.. మొన్న కబోడ్ లో పెట్టిన డబ్బు తీసి ఈవిడకి ఇవ్వమని అంటాడు. కావ్య డబ్బు తీసుకొని వచ్చి పనిమనిషికి ఇస్తుంది. నీకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా తనని అడిగి తీసుకోండని పనిమనిషితో రాజ్ చెప్తాడు. కావ్య తన కోసం రాజ్ కబోడ్ లో పెట్టిన డబ్బుని తన వాళ్ళ కోసం ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. మళ్ళీ అలా వాడితే నాకు నా పుట్టింటి వాళ్లకు గౌరవం కాదని అనుకుంటుంది. నా ఫ్యామిలీకి ఎలా ఫైనాన్సియల్ గా సపోర్ట్ చెయ్యాలని కావ్య ఆలోచిస్తుంటే.. కళ్యాణ్ వచ్చి ఏమైంది? అంతలా ఆలోచిస్తున్నారని అడుగుతాడు. నా ఫ్యామిలీకి పెళ్లికి ముందు సపోర్ట్ చేసినట్లు, ఇప్పుడు  సపోర్ట్ చేసే స్వేచ్ఛ లేదని అంటుంది. వదినకు తన ఫ్యామిలీ ఫైనాన్సియల్ సిచువేషన్ తెలిసినట్లుంది అందుకే బాధపడుతుందేమో అని కళ్యాణ్ అనుకుంటాడు. 

మరొక వైపు స్వప్న బయట నిల్చొని కొరియర్ కోసం వెయిట్ చేస్తుంటుంది. అప్పుడే రాహుల్  వస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావని స్వప్న ని రాహుల్ అడుగుతాడు. మోడల్ కి సెట్ అయ్యే డ్రెస్ ఆర్డర్ చేశా అని స్వప్న చెప్తుంది. నేను లోపలికి వెళ్లి వస్తాను. నువ్వు డ్రెస్ వస్తే తీసుకో అని రాహుల్ కి  స్వప్న చెప్తుంది. రాహుల్ ఫోన్ మాట్లాడుతుండగా కొరియర్ వస్తుంది. దాంతో ఆ కొరియర్ ని ధాన్యలక్ష్మి తీసుకుంటుంది. ధాన్యలక్ష్మి ఓపెన్ చేస్తుండగా.. రాహుల్ చూసి వద్దని అంటాడు. అప్పుడే స్వప్న వచ్చి డ్రెస్ తీసుకొని వెళ్తుంది. మరొక వైపు కావ్య తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.