Read more!

English | Telugu

ఎర్లీగానే బిగ్ బాస్ స్టార్ట్ కాబోతోంది...ఐతే ఇప్పుడు రిలీజ్ ఐన లోగో పెద్ద ఎఫెక్టీవ్ గా లేదు

బిగ్ బాస్ హడావిడి త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. దానికి సంబంధించిన లోగో, లీక్డ్ నాగార్జున పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ సీజన్ ఎలా ఉండబోతోంది ఎవరెవరు వెళ్ళబోతున్నారంటూ ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. ఐతే ఇప్పుడు ఆదిరెడ్డి బిగ్ బాస్ న్యూ సీజన్ కి సంబంధించిన చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది.  రీసెంట్ గా రిలీజ్ ఐన బిగ్ బాస్ కొత్త సీజన్ లోగో గురించి ఆదిరెడ్డి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. "ఇంతకు ముందు సీజన్స్ లో వచ్చిన లోగో కంటే కూడా ఇప్పుడు వచ్చిన లోగో పెద్ద ఇంప్రెసివ్ గా ఎఫెక్టీవ్ గా లేదు. ప్రతీ సీజన్ కి లోగోని మార్చాలని మారుస్తారు తప్ప అందులో పెద్ద మీనింగ్ ఏమీ ఉండదు.

ఆ లోగోని బట్టి సీజన్ ఉంటుంది అనుకుంటారు కానీ అలా ఏమీ ఉండదు. సీజన్ 7 అంకెని అటు ఇటు తిప్పి చూపిస్తున్నారు అంటే ఈ సీజన్ అంత గందరగోళంగా ఉంటుందా అనే విషయం మేకర్స్ కె తెలియాలి తప్ప దాన్ని ఎవరం గెస్ చేయలేము. ఈ లోగోని ఎర్లీగా ఎందుకు రిలీజ్ చేశారు అంటే న్యూ సీజన్ ని  కూడా ఎర్లీగా స్టార్ట్ చేస్తారేమో అనిపిస్తోంది. ప్రెజంట్ నీతోనే డాన్స్ షో జరుగుతోంది కాబట్టి. ఈ షో గనక ఆగష్టు థర్డ్ వీక్ కి పూర్తైపోతే బిగ్ బాస్ సీజన్ ఆగష్టు లాస్ట్ వీక్ స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక న్యూ సీజన్ లో నాగార్జున స్టైల్ బాగా నచ్చింది. బిగ్ బాస్ లాస్ట్ సీజన్ లో  వరల్డ్ కప్ వచ్చింది ఇప్పుడు కూడా అంతే. దీని వలన రేటింగ్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఈ సారి వరల్డ్ కప్ అక్టోబర్ లో ఉంది కాబట్టి బిగ్ బాస్ ని ఎర్లీగా స్టార్ట్ చేసేసి వరల్డ్ కప్ టైంకి మంచిగా పికప్ ఇచ్చి నిలబెడితే రేటింగ్స్ వస్తాయనే ఆలోచన కూడా ఉండొచ్చు. క్వారంటైన్ ఐతే లేదు. ఇప్పటికే కంటెస్టెంట్స్ సెలెక్షన్స్ చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నారు. కంటెస్టెంట్ హెల్త్ మీద బిగ్ బాస్ టీమ్ భయంకరమైన కేర్ తీసుకుంటారు. ఇక బిగ్ బాస్ బజ్ కి యాంకర్ శివ హోస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే లాస్ట్ సీజన్ నుంచి ఇంకా ఎవరైనా కూడా ఉండే అవకాశం ఉంది.. పాపులర్ ఫిగర్స్ ని కంటెస్టెంట్స్ గా తీసుకోవాలి అనుకుంటే టు మంత్స్ ముందే చెప్తారు కామన్ మ్యాన్ ని తీసుకోవాలంటే లాస్ట్ వరకు చెప్పరు " అని చెప్పాడు ఆది.