English | Telugu

ర‌వి చేసిన‌ రొయ్య‌ల ఇగురు.. నోరూరిస్తోంది!

బుల్లితెరపై యాంకర్ రవి ఎంత యాక్టివ్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కో యాంకర్ గా ఎవరు వచ్చినా కూడా రవిలో ఎనర్జీ ఎంతమాత్రం తగ్గదు. లాస్య, శ్రీముఖి, భానుశ్రీ ఇలా ఎంతమంది పక్కన యాంకర్ గా చేసినప్పటికీ తనదైన ముద్ర వేయగలిగాడు. రవి తన ఫ్యామిలీని పరిచయం చేసినప్పటి నుండి ఆయన ఇమేజ్ మారిపోయింది. తన భార్య నిత్య, కూతురు వియాలతో సోషల్ మీడియాలో రవి చేసే అల్లరి మాములుగా ఉండదు. మరీ ముఖ్యంగా కూతురు వియాతో రవి షేర్ చేసే వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

అయితే తన కూతురుకి ఇష్టమైన వంటకాలను వండిపెట్టడానికి రవి చేసే ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గత రెండు రోజులుగా రవి ఇంట్లో చెఫ్ అవతారమెత్తారు. రంజాన్ స్పెషల్ గా బిరియానీ వండేశారు. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆ బిరియానీను వియా రుచి చూసి బాగుందని చెప్పడం.. దానికి రవి సంతోషపడడం కనిపిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేయడంతో వైరల్ అవుతోంది.

ఇక ఆదివారం నాడు రవి మరో స్పెషల్ డిష్ ను వండిపెట్టారు. ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనే పద్దతిని రవి పాటిస్తున్నట్లు ఉన్నారు. ఈ మేరకు ఆదివారం రొయ్యల ఇగురుని ఎంతో ఇష్టంగా భార్య, పిల్లలకు వండిపెట్టారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ''ఆదివారం ఆడవాళ్లకు సెలవు.. రొయ్యల ఇగురు రవి స్టైల్ లో.. అందరూ ఇంట్లోనే ఉంటూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా'' అంటూ క్యాప్ష‌న్‌ ఇచ్చారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.