English | Telugu
అతని మాటల్ని సీరియస్ గా తీసుకుని ఉంటే బాగుండేది అని సారీ చెప్పిన రష్మీ
Updated : Nov 27, 2022
రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద అతనికి సారీ చెప్పింది. ఈ వారం కాయిన్స్ ఎపిసోడ్ లో భాగంగా రష్మీ ఒక గ్లాస్ లోని జ్యూస్ తాగితే అందులో గోల్డ్ కాయిన్ వచ్చింది. "నేను న లైఫ్ లో ఒక మనిషికి సారీ చెప్పాలి. ఆ మనిషి ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు. అతను తన టాలెంట్ ని ఈ స్టేజి మీద చూపించేటప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు. ఐతే ఈ జర్నీలో ఎన్నో విషయాలు చెప్పాడు. మొదట్లో పట్టించుకోలేదు కానీ తర్వాతర్వాత అతను పెర్ఫార్మ్ చేసే స్కిట్స్ కి కనెక్ట్ ఇపోయా. అందుకే మనస్ఫూర్తిగా సారీ చెప్పాలని అనుకుంటున్నా. ఆ రోజు ఆయన చెప్పిన మాటల్ని సీరియస్ గా తీసుకుని ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
ఆ బాబు ఎవరో కాదు మన ఆర్టిస్ట్ బాబు. అప్పట్లో ఆయన వేసిన వేషాలకు యాక్టర్ బాబు కాస్త రైటర్ బాబు అయ్యాడు. అప్పుడు మేమంతా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాడు. అవకాశం ఇవ్వకపోతే కోసుకుంటా అని బెదిరించాడు అందుకే ఈ రైటర్ బాబుని ఆర్టిస్ట్ బాబుగా మార్చాను. అందుకు ఆడియన్స్ కి సారీ" అని చెప్పింది రష్మీ. రష్మీ ఇంతలా చెప్తూండేసరికి మొదట అందరూ సుడిగాలి సుధీర్ గురించి అనుకున్నారు కానీ ఫైనల్ గా బాబు అనేసరికి అందరూ ఫీలయ్యారు.