English | Telugu

'జబర్దస్త్' నుంచి తప్పుకున్న అనసూయ.. షో ప‌రిస్థితేంటి?

అనసూయ బుల్లి తెర మీద ఒక ఆటం బాంబు. నవరసాలు పండించే యాంకర్. ఇటు స్మాల్ స్క్రీన్ మీద, అటు బిగ్ స్క్రీన్ మీద తన సత్తా చాటి దూసుకుపోతున్న స్టైలిష్ యాంకర్. పుష్ప మూవీలో సునీల్ భార్య పాత్రలో మాస్ రోల్ లో నటించింది అనసూయ. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందోన‌నే ఆసక్తి కలిగిస్తోంది. కాగా జబర్దస్త్ షో ద్వారా ఇంత‌దాకా అనసూయ మంచి కామెడీని, హ్యూమర్ ని పంచుతూ వ‌చ్చింది. చాలా కాలంగా ఈ షోకి హోస్ట్ చేస్తోంది అనసూయ. జబర్దస్త్ షో నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరూ దూరమవుతున్నారు. ఇప్పుడు అనసూయ వంతు వచ్చింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే కానీ ఇప్పుడు సడెన్‌గా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట.

తన కెరీర్లో ఇదే చాలా పెద్ద నిర్ణయం అని అంటోంది. "ఈ షోతో నాకుఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని నాతో తీసుకెళ్తున్నా అంది. ఇక ఎప్పటిలాగే మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నాను" అంటూ అనసూయ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. మూవీస్ లో ఛాన్సెస్ వస్తుండడం, అలాగే మరో కొన్ని షోస్ తో ఎంగేజ్ కావడం వలన ఈ షో నుంచి తప్పుకోవాల్సిన‌ పరిస్థితి వచ్చిందేమో అంటున్నారు నెటిజన్స్. ఏదేమైనా జబర్దస్త్ షో ఇప్పటికే రేటింగ్ ప‌డిపోయి, నడవలేక నడుస్తోంది. ఇక ఇప్పుడు అందాల అనసూయ కూడా షో నుంచి తప్పుకుంది. ఇక ఎవరు ఈ షోని హ్యాండిల్ చేస్తారో, జబర్దస్త్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.